టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రతి ఈవెంట్‌కు మెరుగువుతున్న అతడు స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లోనూ మెరిశాడు. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 89.94 మీటర్లు త్రో చేసి రజత పతకం కైవసం చేసుకున్నాడు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో గురువారం జరిగిన డైమండ్ లీగ్ పోటీలో పాల్గొన్న నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనేడియన్ అథ్లెట్ అండర్సన్ పీటర్సన్ 90 […]
డీజిల్ సెస్ పేరుతో నేటి నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు భారీగా పెరిగాయి. ప్రయాణ దూరాన్ని బట్టి కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.140కి పైగా ఆర్టీసీ డీజిల్ సెస్ వసూలు చేయనుంది. బేసిక్ ఛార్జీ, డీజిల్ సెస్ కలిపి కిలోమీటర్ల ప్రతిపాదికన మొత్తం ఛార్జీని నిర్ణయించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు మినహా అన్ని బస్సుల్లో కనీస ఛార్జీలను ఆర్టీసీ పెంచింది. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీని రూ.5 మేర పెంచగా.. […]
బర్మింగ్ హామ్ వేదికగా నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ జరగనుంది. గత ఏడాది కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్‌ను ఐసీసీ తాజాగా నిర్వహిస్తోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా, డ్రా అయినా సిరీస్ మన సొంతం అవుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. రోహిత్ శర్మకు కరోనా నిర్ధారణ కావడంతో ఈ మ్యాచ్‌కు సారథిగా బుమ్రా వ్యవహరించనున్నాడు. వైస్ […]
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయించింది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జూలై 1 నుంచి 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లను వినియోగించరాదు. ఒకవేళ కేంద్రం నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల జైలు, రూ.లక్ష వరకు జరిమానా […]
> నేటి నుంచి దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే ఐదేళ్ల జైలుశిక్ష > నెల్లూరు జిల్లా వెంకటాచలంలో నేడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి > నేడు రాజమండ్రిలో మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటన > నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ రిమాండ్ గడువు > ఇవాళ నుంచి పెరుగనున్న తిరుమల-తిరుపతి మధ్య ఆర్టీసీ ఛార్జీలు.. రూ.75 నుంచి రూ.90కి […]
తనపై ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ విధించడాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే అభియోగంపై సస్పెండ్ చేస్తున్నట్టు జీవో ఇచ్చారని..ఛార్జీ షీట్ లేదు.. ట్రయల్ లేదు.. అయినా తాను సాక్షులను ప్రభావితం చేయడమేంటని ప్రశ్నించారు. ఏమీ లేని దానికి తనను సస్పెండ్ చేస్తూ జీవో ఇచ్చారని.. తనను మళ్లీ సస్పెండ్ చేయాలనే సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో..? ఏ పనికి మాలిన సలహాదారు […]
ఆ జిల్లాలో సగంమంది ఎమ్మెల్యేలను సర్వే టెన్షన్ పెడుతోందా? పార్టీ చేపట్టిన వడపోత.. ఉక్కపోతగా మారి ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఎవరు? సిట్టింగ్‌లు ఆందోళన చెందుతుంటే.. ఆశావహులు హుషారుగా ఉన్నారా? ఇంతకీ ఏంటా జిల్లా? లెట్స్ వాచ్..! మేము సిట్టింగులం.. అధినేతకు అనుకూలంగా ఉన్నాం.. మాకెలాంటి ఢోకా లేదని ఇన్నాళ్లూ కాలం వెళ్లదీసిన MLAలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొదవ లేదు. అలాంటి వారంతా ప్రస్తుతం సర్వే మాట చెప్పగానే ఉలిక్కి పడుతున్నారట. ఒక్కసారిగా మారిన రాజకీయంతో […]
కాంగ్రెస్‌కు తాము దూరంగా ఉన్నామని చెప్పడానికి TRS నానా తంటాలు పడుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకి మద్దతు ఇచ్చిన TRS… అదే కూటమిలో ఉన్న కాంగ్రెస్‌కి తాను దూరమని ఒకటికి పదిసార్లు చెబుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ దగ్గరనే భావన రాబోయే ఎన్నికల్లో చేటు చేస్తుందని గులాబీ నేతల అంచనా. లోలోపల ఎలాంటి సంబంధాలున్నా.. పైకి మాత్రం బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమకు ఒకటే అనే వాదన వినిపిస్తోంది టీఆర్‌ఎస్. అసెంబ్లీ ఎన్నికల […]
ఆత్మకూరు ఉపఎన్నికలో లక్ష మెజారిటీ కోసం లక్ష పాట్లు పడ్డారు వైసీపీ నేతలు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చేశారు. బై ఎలక్షన్‌లో గెలిచినా లక్ష్యాన్ని చేరుకోకపోవడమే అధికారపార్టీ శిబిరంలో చర్చగా మారింది. ఆ అంశంపైనే పోస్టుమార్టం చేస్తున్నారట. పార్టీ నేతల అనైక్యత వల్లే లక్ష మెజారిటీ రాలేదా? ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ బరిలో లేకపోవడం.. బీజేపీ మాత్రమే బరిలో ఉండటంతో.. సులభంగా లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు ఆశించారు. ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా […]
జూలై 8, 9 తేదీల్లో నిర్వహించే వైసీపీ ప్లీనరీకి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో గ్రౌండ్‌ను వైసీపీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మండలి చీఫ్ విప్, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వైసీపీ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని.. పార్టీ నేతలందరూ ఏం చేయాలి, విధి విధానాలు ఎలా ఉండాలి అన్న చర్చ ప్లీనరీలో జరుగుతుందని తెలిపారు. భవిష్యత్‌లో జరిగే కార్యక్రమాలకు సంబంధించి […]