AB Venkateswara Rao: నా సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనపై ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ విధించడాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే అభియోగంపై సస్పెండ్ చేస్తున్నట్టు జీవో ఇచ్చారని..ఛార్జీ షీట్ లేదు.. ట్రయల్ లేదు.. అయినా తాను సాక్షులను ప్రభావితం చేయడమేంటని ప్రశ్నించారు. ఏమీ లేని దానికి తనను సస్పెండ్ చేస్తూ జీవో ఇచ్చారని.. తనను మళ్లీ సస్పెండ్ చేయాలనే సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో..? ఏ పనికి మాలిన సలహాదారు ఇచ్చారో తెలియదన్నారు. తనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన జీవో లీగల్‌గా చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. సీఎం జగన్ మీద ఛార్జీ షీట్లు ఉన్నాయని.. కేసులు ఉన్నాయని.. అయినా సీఎంగా కొనసాగుతున్నారుగా అంటూ ప్రశ్నించారు.
Read Also: రచ్చకెక్కుతున్న వైసీపీ సీనియర్లు..! సొంత పార్టీ నేతలపైనే తీవ్ర ఆరోపణలు
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
కేసులు ఎదుర్కొన్న ఐఏఎస్ శ్రీలక్ష్మీ పదవిలో కొనసాగుతున్నారని.. పదవిలో కొనసాగేందుకు ఆమెకు లేని అభ్యంతరం తనకే ఎందుకు అని ఏబీ వెంకటేశ్వరరావు నిలదీశారు. అసలు డబ్బులు ట్రాన్సక్షన్ జరగని కేసులో అవినీతి ఏంటని ప్రశ్నించారు. కొందరు ఆఫీసర్లు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని.. తనను ప్రభుత్వం టార్గెట్ చేయడం లేదని.. కొందరు వ్యక్తులు.. కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తాను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని తగులబెట్టకుండా ఆపానని.. కోడి కత్తి దాడి సమయంలో గంటల్లోనే రాష్ట్రాన్ని తగులపెట్టాలని టార్గెటుగా పెట్టుకున్నారని.. తాను దాన్ని అడ్డుకున్నానని వివరించారు. అప్పట్లో రాష్ట్రం నాశనం కాకుండా తాను అడ్డుకోవడం ఇష్టం లేని వారు ఇప్పుడు తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది ఎమ్మెల్యేలు బతికే ఉన్నారని.. పార్టీని మారమని తానేమైనా ప్రేరేపించానేమోననే విషయాన్ని వారిని అడగొచ్చుగా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూలగొడతామని రాజ్ భవన్ గేట్ దగ్గర తానేమన్నా మాట్లాడానా అంటూ నిలదీశారు. తనపై విధించిన సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తానని.. ఐపీఎస్ సంఘం ఎందుకు స్పందించడం లేదో వాళ్లనే అడగాలన్నారు. సమాజంలో ఉన్న పురుగులను ఏరివేసే వ్యవసాయం చేస్తూనే ఉన్నానని.. దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసే దాని కన్నా.. వ్యవసాయం చేసుకోవడం మేలని బమ్మెర పోతన చెప్పాడని ఏబీ వెంకటేశ్వరరావు గుర్తుచేశారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!