బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో టీమిండియా తొలుత తడబడినా తరువాత కుదురుకుంది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసి భారత్‌కు మంచి స్కోరును అందించాడు. ఈ మ్యచ్‌లో రిషబ్ పంత్ 111 బంతుల్లోనే 146 పరుగులు చేశాడు. అయితే 89 బంతుల్లోనే సెంచరీ చేసి భారత్ తరఫున టెస్టుల్లో వేగంగా సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. దీంతో 17 ఏళ్ల క్రితం నాటి ధోనీ రికార్డును […]
ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చంద్రబాబు కోరారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరిని చేర్చడం సంతోషమని, ఈ విషయంలో తెలుగు ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. జూలై 4న భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ప్రజల మనసుల్లో గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. Read Also: RK […]
ఇంగ్లండ్‌తో జరగనున్న కీలక టెస్టు మ్యాచ్‌లో శుక్రవారం నుంచి టీమిండియా తలపడనుంది. గత ఏడాది జరగాల్సిన ఈ టెస్టును ఐసీసీ రీ షెడ్యూల్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో అభిమానులు ఆసక్తికర పోరును వీక్షించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ వర్సెస్ జేమ్స్ అండర్సన్ మధ్య జరిగే పోరు అందరిలోనూ ఉత్కంఠకు గురిచేస్తోంది. దశాబ్ద కాలంగా ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నారు. అండర్సన్ కెరీర్‌లో చివరి దశకు చేరుకోవడంతో టీమిండియాతో అతడికి ఇదే చివరి టెస్టు […]
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదన్నారు. రెండు నెలలు కాకముందే డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సామాన్యుడిపై పెను భారం మోపడమేనని లోకేష్ ఆరోపించారు. పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.90 పెంచారని.. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.120, ఏసీ సర్వీసుల్లో […]
ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తాయని, మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని.. నిజంగా ఆ ధైర్యం ఉంటే..అసెంబ్లీని రద్దు చేయాలని జగన్‌ను సవాల్ చేస్తున్నట్లు జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. వైసీపీ ప్లీనరీలో జగన్ ఈ విషయం గురించి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. వైసీపీ అంటే గోల్‌మాల్ పార్టీ అని ప్రజలు […]
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ‘కమింగ్’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో ‘లైగర్’ నుంచి టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ కాబోతుందని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. లైగర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ సినిమా తర్వాత […]
రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్‌లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్‌లో క్యాటరింగ్‌తో సహా అన్ని స్టాల్స్‌లో నగదుకు బదులుగా డిజిటల్ పద్ధతిలో విక్రయిస్తారు. ఇలా చేయకుంటే రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు అధికారులు జరిమానా విధించనున్నారు. డిజిటల్ చెల్లింపుల కోసం విక్రేతలు తప్పనిసరిగా యూపీఐ, […]
ఏపీలో అన్ని థియేటర్లలో ఆన్‌లైన్ సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారంపై శుక్రవారం నాడు హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయంపై హైకోర్టు స్టే విధించింధి. జీవో నెంబర్ 69ని నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఆన్‌లైన్ టిక్కెట్ల వ్యవహారంపై ప్రభుత్వం జీవో నంబర్ 69 జారీ చేయగా.. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ […]
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. తొలుత ఓ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ అనంతరం వన్డేలు, టీ20లలో కూడా ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మేరకు వన్డేలు, టీ20లకు భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి హార్డిక్ పాండ్యా పునరాగమనం చేశాడు. అటు గాయం నుంచి కోలుకున్న జడేజా కూడా వన్డేలకు అందుబాటులోకి రానున్నాడు. ఇటీవల పొట్టి క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా సెలక్టర్లు […]
పెళ్లి చేసుకోవాలనుకునే పేదలకు టీటీడీ అధికారులు గుడ్‌న్యూస్ అందించారు. ఉచిత వివాహాలు జరిపించేందుకు టీటీడీ చేపట్టిన కళ్యాణమస్తు కార్యక్రమానికి నేటి నుంచి ఈనెల 20 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 7న వీరికి ఉచిత సామూహిక వివాహాలు చేయనున్నారు. కళ్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న నూతన వధూవరులకు ఉచితంగా 2 గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండిమెట్టెలు, పెళ్లి వస్త్రాలు, […]