అప్పట్లో ఆ నియోజకవర్గం హస్తానికి కంచుకోట.ఇందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ చెప్పుకోదగ్గ నేత ఒక్కరూ కనిపించటం లేదట. ఒక్కరైనా దొరకరా అని అధిష్టానం ఎంత వెతికినా ప్రయోజనం లేదట. మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేయటం ఆ పార్టీ పెద్ద టాస్క్‌లా మారిందట.. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో బలంగా ఉండేది. కాంగ్రెస్ తరపున సునీతా లక్ష్మారెడ్డి గతంలో మూడు సార్లు వరుసగా గెలుపొందారు. […]
జూలై 4న భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమానికి జనసేన పార్టీని ఆహ్వానించలేదని వస్తున్న విమర్శలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమానికి ప్రత్యేకంగా జనసేనను ఆహ్వానించాల్సిన అవసరం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. బీజేపీ-జనసేన ఒక్కటేనని.. పవన్ తమ ఇంట్లో అతిథిలాంటి వాడని విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భీమవరంలో అల్లూరి జయంతి సభను రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. మోదీ సభకు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 20 […]
అక్కడ గ్రూపు తగాదాలకు అంతం లేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టినా పరిస్థితి మారలేదు. స్థానిక లీడర్ల నుండి, జిల్లా మంత్రుల వరకు అందరితో ఆమెకు తలనొప్పులే కొనసాగుతున్నాయి. లేటెస్టుగా జరుగుతున్న ప్లీనరీలు పరిస్థితిని మరింత స్పష్టం చేశాయి. ప్లీనరీల సాక్షిగా ఏకాకిగా మారారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. అయినా సొంత జిల్లాలో మాత్రం చిక్కులు తప్పటం లేదు. తనను అణగదొక్కడానికి చూస్తున్నారని, ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న […]
కోనసీమ జిల్లా రాజోలు వైసీపీలో మళ్ళీ రచ్చ మొదలైంది. రాజోలు వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బొంతు రాజేశ్వరరావు ప్రస్తుతం వైసీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అనుచరులతో జరిగిన సమావేశంలో బొంతు రాజేశ్వరరావు మాటలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. రెండు రోజుల క్రితమే బొంతు రాజేశ్వరరావు ఇంటికెళ్లి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీ ప్లీనరీ సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఇప్పటికే పార్టీ […]
కుప్పంలో ఓడిపోయినా టీడీపీ అక్కడ గెలిచి రికార్డు సృష్టించింది. అధినేత కూడా అన్ని వేదికలపైనా ఆ గెలుపు గురించే మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా దుబాయ్ గోల వచ్చిపడింది. దీంతో జెట్ స్పీడులో దూసుకుపోతున్న పార్టీ కాస్తా ఇప్పుడు సైలెంటైంది. దీంతో తమ్ముళ్లలో ఎక్కడలేని అయోమయం ఏర్పడిందట. ఇంతకీ దర్శి టీడీపీలో దుబాయ్ గోల తీరేదెపుడు? ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో పడిపోయారట. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడినా ఆ తర్వాత తొలిసారిగా జరిగిన […]
ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను చూస్తే పాపం అని టీమిండియా అభిమానులు అనక మానరు. ఎందుకంటే గతంలో టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టి అతడికి యువరాజ్ సింగ్ నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ఇప్పటికీ ఆ ఓవర్‌ను అటు ఇంగ్లండ్ అభిమానులు, ఇటు టీమిండియా అభిమానులు మరిచిపోలేరు. తాజాగా బర్మింగ్ హామ్ టెస్టులో బ్రాడ్ బౌలింగ్‌లోనే ఒకే ఓవర్‌లో బుమ్రా 35 పరుగులు పిండుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక […]
చాలా కాలం తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ నేతలతో కలిసి టీడీడీ ఎంపీ కేశినేని నాని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్ని కుల క్షత్రియుల భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంపీ కేశినేని నాని రూ. 65 లక్షలు కేటాయించారు. విజయవాడ ఆటో నగర్‌లో తమకున్న స్థలంలో అగ్నికుల క్షత్రియులు భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు ఎంపీ ల్యాడ్స్ నిధులను కేటాయించినందుకు ఎంపీ కేశినేని నానికి అగ్నికుల క్షత్రియులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ […]
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి రోజు పంత్ మెరుపు సెంచరీ చేయగా.. రెండో రోజు తొలి సెషన్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జడేజాకు ఇది మూడో సెంచరీ కాగా ఈ ఏడాది రెండో సెంచరీ. అటు ఓవర్సీస్‌లో మాత్రం జడేజాకు ఇదే తొలి సెంచరీ. అతడు 183 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో సెంచరీ పూర్తి […]
ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన వారిని దూరంగా ఉంచడాన్ని మనందరం చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలను చేపట్టరు. ముఖ్యంగా అత్తగారింట్లో కోడలిని ఉంచకూడదని భావిస్తారు. ఎందుకంటే ఉత్తరాయణ, దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢ మాసంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవనే నమ్ముతారు. దీంతో ఆషాఢంలో కొత్తగా వచ్చిన కోడలిని అత్తగారింట్లో ఉంచకుండా పుట్టింటికి పంపించేస్తారు. ఈ మాసంలో తొలకరి […]