రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సెల్‌ఫోన్ చోరీకి గురైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటనలో ఎంపీ మార్గాని భరత్ పాల్గొనగా.. ఆయన ఫోన్‌ను దుండగులు కొట్టేసినట్లు తెలుస్తోంది. తన ఫోన్ చోరీకి గురైందన్న విషయంపై ఎంపీ భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరగా రాజమండ్రి ఎయిర్‌పోర్టులోని హెర్బల్ షాపులో పని చేసే యువతితో ఆయన తన ఫోన్‌తో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఫోన్ కనిపించలేదని ఎంపీ భరత్ వివరించారు. ఎంపీ వ్యక్తిగత […]
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో టీమిండియా చేతులారా ఓటమిని కొని తెచ్చుకుంది. ముఖ్యంగా నాలుగో రోజు బౌలింగ్ వైఫల్యం జట్టు కొంప ముంచింది. దీంతో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా బౌలర్లు ఏ విధంగానూ ఇబ్బందిపెట్టలేకపోయారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56), జాక్ క్రాలీ (46) సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి నాంది […]
జైళ్లలో సత్ప్రవర్తన కనబరుస్తున్న ఖైదీలను విడుదల చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా 50ఏళ్లు దాటిన మహిళలు, ట్రాన్స్‌జెండర్ ఖైదీలకు శిక్ష తగ్గించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. మొత్తం శిక్షాకాలంలో సగానికి పైగా శిక్ష పూర్తి చేసుకున్న 60ఏళ్లు దాటిన పురుషులు, దివ్యాంగులైన ఖైదీలకు కూడా జైలు శిక్షను తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే మరణ శిక్ష, జీవిత ఖైదు పడిన వారికి, అత్యాచారం, […]
ఏపీలో ఈనెలలోనే మరో పథకం అమలు కానుంది. ఈనెల 13న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఆర్ధిక సహాయం అందనుంది. సొంత వాహనాలు కలిగిన ప్రతి ఒక్కరికీ ఈనెల 13న బ్యాంకు ఖాతాల్లో రూ.10వేలు జమచేస్తామని రవాణాశాఖ కమిషనర్ పి.రాజబాబు వెల్లడించారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్‌లకు సీఎం చేతుల మీదుగా ఈ ఆర్ధిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు. వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, మరమ్మతుల నిమిత్తం నగదు […]
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకున్నాడు. ఇటీవల అతడికి చేసిన కరోనా నిర్ధారణ పరీక్షణ నెగిటివ్ రావడంతో రోహిత్ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ మేరకు అతడు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ కఠోర సాధన చేస్తున్నాడు. భారీ షాట్లతో పాటు డిఫెన్సివ్ షాట్లు ఆడుతూ రోహిత్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. దీంతో అతడు త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డేలు, టీ20లకు అందుబాటులో ఉండటం […]