Pawan Kalyan: ప్రధాని మోదీ పర్యటనకు పవన్ కళ్యాణ్ దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూరమయ్యారు. అయితే వ్యక్తిగతంగా ఆయన బిజీ షెడ్యూళ్ల కారణంగానే ప్రధాని పర్యటనకు దూరమైనట్లు జనసేన వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు పవన్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అద్భుతమైన కార్యక్రమం అని పవన్ ప్రశంసించారు. దక్షిణ భారతదేశానికి చెందిన మహాయోధుడి గొప్పతనం గురించి యావత్ ప్రపంచానికి తెలియజేయడానికి చేస్తున్న కార్యక్రమం అభినందనీయమన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తున్న ప్రధాని మోదీకి జనసేన తరపున పవన్ కళ్యాణ్ శుభాభివందనాలు తెలిపారు. భీమవరంలో పోటీ చేసిన తనకు ఇది ప్రత్యేకమని అభివర్ణించారు. పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పవన్ సూచించారు.
Read Also: Nara Lokesh : అల్లూరి విగ్రహావిష్కరణపై ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
మరోవైపు టీడీపీ నుంచి ప్రధాని బహిరంగ సభ కార్యక్రమానికి ప.గో. జిల్లా ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన శివరామరాజు హాజరుకానున్నారు. అయితే పీఎంవో అధికారిక షెడ్యూల్‌లో జనసేన నేతల పేర్లు ఎక్కడా ప్రస్తావనకు రాలేదని తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. ఆయన్ను ప్రత్యేకంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించిన నేపథ్యంలో ఇప్పటికే చిరంజీవి భీమవరం చేరుకున్నారు. తన సొంత జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం.. అందులోనూ అల్లూరి సీతారామ రాజుకు గౌరవంగా నిర్వహిస్తుండటంతో ప్రధాని సభకు హాజరవ్వాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు.
అటు ప్రధాని మోదీ భీమవరం పర్యటన జాబితాలో ఎక్కడా తన పేరు లేకపోవడంతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. తాను భీమవరం రావడం లేదంటూ ఆయన ప్రధానికి లేఖ రాశారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధానిని స్థానిక ఎంపీ ఆహ్వానించాలని, కానీ ప్రధాని పర్యటన జాబితాలో తన పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?