Amaravati Capital Construction: రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం..
- రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టం..
- హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ..
- ప్రత్యేక పూజల తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించిన మంత్రి..
- B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనం గా హై కోర్టు నిర్మాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Capital Construction: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతమైంది. రాజధానిలో ఐకానిక్ భవనంగా నిర్మించనున్న హైకోర్టు భవనానికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ (Raft Foundation) పనులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లతో కలిసి రాఫ్ట్ ఫౌండేషన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: Viral Video: బైకులో కనపడకుండా అంత డబ్బు ఎలా దాచవయ్యా.. ఇంత ట్యాలెంట్ గా ఉన్నావేంట్రా..!
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
అమరావతిలో హైకోర్టు భవనాన్ని B+G+7 (బేస్‌మెంట్ + గ్రౌండ్ + 7 అంతస్తులు) మోడల్‌లో అత్యాధునిక, ఆకర్షణీయ, ఐకానిక్ డిజైన్‌తో నిర్మించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ Norman Foster and Partners రూపొందించిన డిజైన్ ఆధారంగా ఈ నిర్మాణం కొనసాగనుంది. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 52 కోర్టు హాల్స్‌తో కూడిన ఈ హైకోర్టు భవనం, రాష్ట్ర న్యాయవ్యవస్థకు కొత్త గుర్తింపుగా నిలవనుంది. అంతస్తుల వారీగా కోర్టులను ఏర్పాటు చేయనున్నారు..
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. 2, 4, 6వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు.. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందన్నారు.. భవన నిర్మాణంలో మొత్తం 45,000 టన్నుల స్టీల్ వినియోగిస్తున్నారని తెలిపారు.. మొత్తం 52 కోర్టు హాల్స్‌తో నిర్మాణం జరగనుంది అన్నారు.. ఇక, అమరావతి హైకోర్టు నిర్మాణాన్ని 2027 చివరికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పండుగల అనంతరం కూడా నిర్మాణ పనులు వేగం తగ్గకుండా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.
మరోవైపు, అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. అమరావతి నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. రాజధానిలో మొత్తం 7 భవనాలను ఐకానిక్ భవనాలుగా తీర్చిదిద్దుతున్నాం. Norman Foster and Partners ఇచ్చిన ప్రపంచస్థాయి డిజైన్‌తో ఈరోజు హైకోర్టు పనులు ప్రారంభించాం. ఇది ఏపీ న్యాయవ్యవస్థకు భవిష్యత్తు ల్యాండ్‌మార్క్.గా అభివర్ణించారు. హైకోర్టు భవనం 21 లక్షల చ.అ. విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్‌తో నిర్మించబడుతోంది. 2, 4, 6వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు, 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుంది అన్నారు.. భవన నిర్మాణానికి మొత్తం 45,000 టన్నుల స్టీల్ వినియోగిస్తున్నాం. 2027 చివరికి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.. గత ప్రభుత్వం చేసిన అవకతవకల కారణంగా అమరావతి పనులు ఆలస్యం అయ్యాయి. ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా పారదర్శకంగా, వేగంగా పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు మంత్రి నారాయణ..
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!