భీమవరంలో నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ఏపీ పర్యాటక, సాంస్కృతిక మంత్రి రోజా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సభా వేదికపై అంతా తానే వ్యవహరించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా ముఖ్య అతిథులను మంత్రి రోజానే సాదరంగా ఆహ్వానించారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవితో సరదాగా మాట్లాడారు. అయితే ప్రధాని మోదీ తన ప్రసంగం ముగించిన తర్వాత మంత్రి రోజా ఆయన దగ్గరకు వెళ్లి ‘మోదీ సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్’ అంటూ అడిగారు. ఆ వెంటనే సీఎం జగన్ కూడా ఆమెతో కలిసి సెల్ఫీకి పోజులివ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మేరకు దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం జగన్‌లతో మంత్రి రోజా తీసుకున్న సెల్ఫీ ఎంతో ప్రత్యేకమైనదిగా భావించొచ్చు. మంత్రి రోజా తీసుకున్న సెల్ఫీలో మెగాస్టార్ చిరంజీవి కూడా కవర్ అయ్యారు.
Read Also: Miyazaki Mangoes: బాబోయ్.. రెండు మామిడి చెట్లకు అంత సెక్యురిటీనా.?
కాగా భీమవరం పెదఅమిరంలో ప్రధాని మోదీ పాల్గొన్న సభా వేదికపై మొత్తం 11 మందికి అవకాశం దక్కింది. అందులో గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి రోజా, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలను నిర్వహించారు. అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం గురించి పత్రికల్లో భారీ స్థాయిలో మంత్రి హోదాలో రోజా ప్రకటనలు ఇవ్వడం విశేషం.