IRCTC: అండమాన్ టూర్ వెళ్లాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజ్ గురించి తెలుసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC: దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరుపతి, షిర్డీ, పూరీ వంటి పుణ్యక్షేత్రాలతో పాటు అండమాన్ దీవులు వంటి పర్యాటక ప్రదేశాలకు కూడా ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా ప్యాకేజీలను ప్రకటించింది. అందమైన దీవులు చూడాలని భావించేవారికి అండమాన్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 5 రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీతో ఇది ఉంటుందని వివరించింది. హేవ్ లాక్, పోర్టు బ్లెయిర్ వంటి వివిధ ప్రాంతాలు ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. జనవరి 28 నుంచి అండమాన్ టూర్ ప్యాకేజీని టూరిస్టులు పొందవచ్చు. విమాన ప్రయాణంతో పాటు ఛార్జీలు కలిపి ఉండనున్నాయి.
తొలిరోజు విశాఖ నుంచి ఉదయం 8:40 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12:50 గంటలకు పోర్టుబ్లెయిర్ చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. మధ్యాహ్నం సెల్యులార్ జైలు, కార్బిన్స్ కోవ్ బీచ్ సందర్శిస్తారు. తర్వాత సెల్యులార్ జైలులో లైట్, సౌండ్ షో చూడొచ్చు. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రి భోజనం, బస ఉంటుంది. రెండో రోజు హోటల్‌లోనే అల్పాహారం చేసి రాస్ ఐలాండ్ బయలుదేరుతారు. అనంతరం నార్త్ బే సందర్శన ఉంటుంది. అక్కడ లంచ్ చేసిన తర్వాత నేవల్ మెరైన్ మ్యూజియానికి తీసుకువెళ్తారు. రెండో రోజు కూడా పోర్టు బ్లెయిర్‌లోనే బస ఉంటారు. మూడో రోజు ఉదయం హోటల్‌లోనే అల్పాహారం చేసి చెక్ అవుట్ అవుతారు. అనంతరం హావ్‌లాక్ ద్వీపానికి తీసుకెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. తర్వాత ఎలిఫెంట్ బీచ్‌కి వెళ్లి వాటర్ స్పోర్ట్ ఎంజాయ్ చేయవచ్చు. సాయంత్రం రాధానగర్ బీచ్ సందర్శన ఉంటుంది. రాత్రికి హోటల్‌లో బస చేస్తారు.
Also Read
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
Read Also: Bobby: ప్రతి సీన్ లో ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్ ఉంటుంది
నాలుగోరోజు హావ్‌లాక్ ద్వీపంలోని హోటల్‌లో అల్పాహారం చేసి చెక్ అవుట్ అవ్వాలి. అనంతరం కాలాపత్తర్ బీచ్‌కు తీసుకువెళ్తారు. నీల్ ద్వీపం కోసం ప్రీమియం క్రూయిజ్ ఎక్కాలి. అక్కడకు చేరుకున్న తర్వాత హోటల్‌కు వెళ్లి చెక్ ఇన్ చేయాలి. రిఫ్రెష్ అయిన తర్వాత సహజ వంతెన, లక్ష్మణపూర్ బీచ్ సందర్శన ఉంటుంది. నీల్ ద్వీపంలోనే రాత్రి డిన్నర్, బస ఉంటుంది. ఐదోరోజు నీల్ ద్వీపంలోని హోటల్‌లో అల్పాహారం ముగించుకుని చెక్ అవుట్ అవ్వాలి. క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరాలి. విశ్రాంతి, షాపింగ్ కోసం టైమ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రి భోజనం, బస ఉంటుంది. ఆరో రోజు ఉదయం అల్పాహారం చేసిన తర్వాత హోటల్‌లో చెక్ అవుట్ అవ్వాలి. ఉ.7:45 గంటలకు విశాఖపట్నానికి విమానం బయలుదేరుతుంది. ఉ.11:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అండమాన్ టూర్ ప్యాకేజీలో సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.63,525, డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.47,270, ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.45,765గా ధరలు వసూలు చేస్తారు. ప్రయాణ టిక్కెట్లు, హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి.
తాజావార్తలు
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!