Gudivada Amarnath: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య బాబు కాదని.. బాలయ్య తాత అని సంభోదించారు. బాలయ్యకు 60 ఏళ్లు దాటాయని.. బాలయ్య తాతను చూడటానికి ఎవరు వస్తారని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అనుకున్నంత జనం రాలేదని.. బాలయ్య ఇంకా సమరసింహారెడ్డి కాదు ఇప్పుడు వీరసింహారెడ్డి అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. జనాలు లేకే చంద్రబాబు, బాలయ్య బాబు రోడ్లపై మీటింగ్‌లు పెట్టుకుంటున్నారని చురకలు అంటించారు. కాయగూరలు కొనడానికి, పల్లీలు కొనడానికి వచ్చిన వాళ్ళతో మీటింగ్‌లు పెట్టి జనాన్ని చంపాలని చూస్తున్నారని విమర్శలు చేశారు. విశాఖలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ కోసం దరఖాస్తు చేస్తే పరిశీలించి అనుమతి ఇస్తామని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.
Read Also: Avatar 2: అవెంజర్స్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన అవతార్ 2…
అటు విశాఖ నుంచి రాజధాని కార్యకలాపాలు ప్రారంభం అయ్యే సమయం దగ్గరకు వచ్చిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తన వ్యక్తిగత ఉద్దేశం ప్రకారం ఎటువంటి బిల్లు పెట్టకుండా సీఎం వైజాగ్ రావాలని కోరుకుంటానని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం తర్వాత ఎప్పుడైనా విశాఖ క్యాపిటల్ నుంచి పాలన ప్రారంభమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే బీఆర్ఎస్ అయినా కేఏ పాల్ పార్టీ అయినా ఒక్కటే అని చురకలు అంటించారు. ఆయా పార్టీల గురించి చర్చించి సమయం వృధా అని పేర్కొన్నారు.