IND Vs SL: రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరగనున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అనూహ్యంగా మార్పులు లేకుండానే టీమిండియా ఈ మ్యాచ్‌లోకి బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. ముఖ్యంగా రెండు మ్యాచ్‌లలో విఫలమైన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను తీసుకుంటారని ప్రచారం జరిగింది. అంతేకాకుండా రెండో టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా పక్కనబెడతారని అందరూ ఊహించారు. కానీ వీళ్లిద్దరికీ మరోసారి హార్దిక్ పాండ్యా అవకాశం కల్పించాడు.
Read Also: KA Paul : రెచ్చగొడితే రెచ్చిపోవద్దు.. నేనున్నాను
కాగా రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని క్యూరేటర్లు చెప్తున్నారు. దీంతో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బౌలర్లను హార్దిక్ తెలివిగా ఉపయోగించుకోవాల్సి ఉంది. పవర్‌ప్లేలో అద్భుతంగా రాణిస్తున్న పాండ్యా డెత్ బౌలింగ్ భారాన్ని కూడా భుజాలకు ఎత్తుకుంటే బాగుంటుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లే సిరీస్ చేజిక్కించుకుంటారు. తొలి టీ20లో భారత్ గెలవగా రెండో టీ20లో శ్రీలంక విజయం సాధించింది. రెండో టీ20లో టీమిండియా పోరాడి ఓడిపోయింది.