Ind vs SA 2nd T20I: న్యూచండీగఢ్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారీ స్కోర్ సాధించారు. టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) విధ్వంసం సృష్టించాడు. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 195.65 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 90 పరుగులు చేసి సెంచరీకి చేరువలో రనౌట్ అయ్యాడు. అలాగే కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ (Aiden Markram) 26 బంతుల్లో 29 పరుగులు చేయగా, చివర్లో డోనోవన్ ఫెరీరా (Donovan Ferreira) 16 బంతుల్లో 30 పరుగులు నాటౌట్, డేవిడ్ మిల్లర్ (David Miller) 12 బంతుల్లో 20 పరుగులు నాటౌట్.. వేగంగా పరుగులు సాధించడంతో స్కోరు 200 మార్కును దాటింది.
భారత బౌలర్లలో కేవలం వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేయగలిగాడు. తన 4 ఓవర్లలో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ (Axar Patel) 1 వికెట్ తీశాడు. ఇక టీంఇండియా పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (4-0-54-0), జస్ప్రీత్ బుమ్రా (4-0-45-0), హార్దిక్ పాండ్యా (3-0-34-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అర్ష్‌దీప్ ఏకంగా 9 వైడ్‌లు విసరడం గమనార్హం. దక్షిణాఫ్రికా చివరి 5 ఓవర్లలో 57 పరుగులు సాధించింది. ఇక 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే టీమిండియా ఓపెనర్లు, ముఖ్యంగా ఫామ్ లేమితో ఉన్న శుభ్‌మన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుండి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాల్సిందే.
Droupadi Murmu : ఈనెల 17న తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము