Anil Kumar Yadav: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై నందమూరి హీరోలు చేసిన ట్వీట్లపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఇప్పుడున్న టీడీపీ నారా వారి పార్టీగా మారిందని.. ఎన్టీఆర్ పేరు ఎత్తే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టుకోలేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాన్ని వైఎస్ఆర్ తెచ్చారని.. ఆ […]
Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో అందరికీ తెలుసు. బౌలర్ ఎక్కువ పరుగులు ఇచ్చినా.. ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేసినా ధోనీ ఎప్పుడూ అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించదు. అందుకే ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని అభివర్ణిస్తారు. అయితే తనకు మైదానంలో ఎందుకు కోపం రాదో.. తన కూల్‌నెస్‌కు కారణాలేంటో తాజాగా ధోనీ వెల్లడించాడు. తాను […]
Nadendla Manohar: ఏపీ సీఎం జగన్ కుప్పం పర్యటనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. కుప్పంలో శుక్రవారం నాడు జగన్ పర్యటన సందర్భంగా అధికారులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. కుప్పంలో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఈ చర్యలను ఉద్దేశిస్తూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. ఒక్క బటన్ నొక్కడానికి మూడు వరుసల బ్యారికేడ్లు అవసరమా అని ఎద్దేవా చేశారు. మూడు […]
Death Certificate: ఎవరైనా తమ స్టడీ సర్టిఫికెట్లు పోయాయని లేదా విలువైన ఆస్తి పత్రాలు పోయాయని పేపర్‌లో ప్రకటన ఇస్తుంటారు. కానీ డెత్ సర్టిఫికెట్ పోయిందని ఎవరైనా ప్రకటన ఇస్తారా.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన డెత్ సర్టిఫికెట్ పోయిందని ఓ వ్యక్తి పేపర్‌లో ప్రకటన ఇవ్వడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఒక వ్యక్తి ‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో తన మరణ ధృవీకరణ […]
Rahul Dravid: ఆసియా కప్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన భారత అభిమానులకు కలవరపరుస్తోంది. ముఖ్యంగా టీమ్ పేలవమైన బౌలింగ్ ప్రదర్శనతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో రాబోయే టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని టీమ్‌కు మరిన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు, వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించడం మేలని కోచ్ రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నాడు. ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఎక్కువ వార్మప్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐని కోరాడు. ద్రవిడ్ విజ్ఞప్తితో పాటు అభిమానుల […]
CM Jagan: చిత్తూరు జిల్లా కుప్పం వేదికగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. కుప్పంలో చంద్రబాబుపై ప్రజలు విసిగిపోయారని.. అందుకే 2019 తర్వాత కుప్పంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు వైసీపీ జెండాను ఎగురవేశారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కుప్పం నియోజకవర్గం బీసీలు పోటీ చేయాల్సిన సీటు అని.. కానీ చంద్రబాబు బీసీల సీటును లాక్కుని పోటీ చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి బీసీలను న్యాయం చేస్తాడని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. గత […]
ICC Test Championship Finals: క్రికెట్‌లో టెస్ట్ క్రికెట్‌లో ఉండే మజానే వేరు. కానీ కొన్నేళ్లుగా టీ20లు రాజ్యమేలుతున్నాయి. దీంతో ఐసీసీ టెస్ట్ క్రికెట్ పునరుజ్జీవం కోసం టెస్టు చాంపియన్ షిప్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ జట్ల మధ్య టెస్టు సిరీస్‌లు జరిపి పాయింట్ల ఆధారంగా రెండేళ్లకోసారి ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గత ఏడాది తొలిసారిగా జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడగా న్యూజిలాండ్ విన్నర్‌గా […]
Lottery Tickets: కేరళలో లాటరీలు కొంతమందికి కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. ఇటీవల కేరళలో ఓ ఆటోడ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. అతడికి రూ.25 కోట్ల లాటరీ తగిలింది. అయితే అందరినీ అలాంటి అదృష్టం వరించదు. నాణేనికి బొమ్మ ఉన్నట్లే బొరుసు కూడా ఉంటుంది. నాణేనికి మరోవైపు పరిశీలిస్తే లాటరీ టిక్కెట్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కష్టాలు పడే వాళ్లు కూడా ఉన్నారు. కేరళలోనే మరో వ్యక్తి 52 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు […]
Hyderabad: దేశంలోని అన్ని మెట్రో నగరాలలో భద్రత గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం దేశంలోనే సేఫ్ సిటీగా నిలిచింది. ఈ జాబితాలో రెండో స్థానంలో మహారాష్ట్రలోని పుణే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2021లో హైదరాబాద్ నగరంలో మొత్తం 2,599 నేరాలు నమోదయ్యాయి. కోల్‌కతా 1,034 నేరాలతో అతి తక్కువ నేరాలు […]
Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. చివరి రోజు జరిగిన సమావేశాల్లో మొత్తం 9 బిల్లులు ఆమోదం పొందాయి. బుధవారం మూజువాణి ఓటుతో తొమ్మిది బిల్లులను సభ ఆమోదించింది. ఈ బిల్లుల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా సవరణ బిల్లును ఏపీ వైద్య, ఆరోగ్య మంత్రి విడుదల రజినీ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ […]