Vijayawada: దసరా పండగ సమయంలో ప్రత్యేక రైళ్లను నడపాల్సిన అధికారులు ఉన్న రైళ్లు రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల కోసం విజయవాడ మీదుగా నడిచే వందలాది రైళ్లను రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కొన్ని రైళ్లను దారి మళ్లించారని.. విజయవాడ స్టేషన్‌కు వెళ్లకుండా రాయనపాడు, రామవరప్పాడు స్టేషన్‌లలో కొన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించారని ఓ మెసేజ్ తెగ సర్క్యులేట్ అవుతోంది. 9 9 […]
Hyderabad Cricket Association: కొన్నిరోజులుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వార్తల్లో మెయిన్ టాపిక్ అవుతోంది. భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20కి సంబంధించి టిక్కెట్ల అమ్మకాలలో అక్రమాలకు పాల్పడిందంటూ ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విమర్శల పాలైంది. అయితే తాజాగా టిక్కెట్లకు సంబంధించి మరో తప్పిదం చేసిందని హెచ్‌సీఏపై అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. టిక్కెట్లపై మ్యాచ్ టైమింగ్ తప్పుగా ముద్రించిందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. టాస్ సాయంత్రం 6:30 గంటలకే వేస్తారు. కానీ […]
Jhulan Goswami: టీమిండియా మహిళా జట్టు దిగ్గజ పేసర్ జూలన్ గోస్వామి తన కెరీర్‌లో చిట్టచివరి మ్యాచ్ ఆడేసింది. ఈరోజు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే ఆమెకు చివరి మ్యాచ్. అయితే ఆఖరి మ్యాచ్‌లో జూలన్ గోస్వామి బ్యాటింగ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరగడం అభిమానులను నిరాశపరిచింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జూలన్ గోస్వామిని భారత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రత్యేకంగా గౌరవించింది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్‌కౌర్ కన్నీటిపర్యంతమైంది. అటు […]
YSRCP: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి జగన్ ప్రభుత్వం పేరు మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే బాలయ్యకు వరుసగా మంత్రులందరూ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంత్రులు ట్వీట్లు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారో చెప్పాలని బాలయ్యను మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. మీరంతా కలిసి చంపేశాకే కదా.. చేసిన పాపం పేరు పెడితే పోతుందా అంటూ నిలదీశారు. […]
Tirumala: ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుమల చేరుకునే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి కీలక సూచనలు చేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 4వేల మంది సిబ్బందితో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2వేల మంది పోలీసులు అదనంగా గరుడ సేవ కోసం సేవలు అందిస్తారని.. మొత్తం 6వేల మంది పోలీసులు బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 27న […]
Russia-Ukrain War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎందరో సామాన్యుల జీవితాలను తలకిందులు చేసింది. ఒకరకంగా ఈ యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పలు దేశాలకు ఎగుమతులు, దిగుమతులపై ఈ యుద్ధం ప్రభావం చూపడంతో నిత్యావసర ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. అయితే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం వల్ల భారత్ లాభపడిందని ప్రచారం జరుగుతోంది. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యా దగ్గర డిస్కౌంట్ ధరకు క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడంతో […]
Mahendra Singh Dhoni: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ నెల 25న సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియా లైవ్‌లోకి వచ్చి సర్‌ప్రైజ్‌ను ధోనీ రివీల్ చేయనున్నాడు. సాధారణంగా ధోనీ సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే యాక్టివ్‌గా ఉంటాడు. చాలా అరుదుగా పోస్టులు చేస్తుంటాడు. అయితే ఫేస్‌బుక్‌లో మాత్రం అప్పుడప్పుడు పోస్టులు పెట్టి అభిమానులను ఉత్సాహపరుస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఈనెల 25న లైవ్‌లో ఓ […]
IND Vs AUS: ఆదివారం నాడు హైదరాబాద్‌లో కీలక మ్యాచ్ జరగనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి టీ20 కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ సందర్భంగా తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. అయినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. శంషాబాద్ చేరుకున్న అనంతరం టీమిండియా, ఆస్ట్రేలియా టీమ్‌ల […]
Team India: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం నాడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించగా.. నాగపూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో హైదరాబాద్‌లో జరిగే టీ20లో ఎవరు గెలిస్తే వాళ్లు సిరీస్ కైవసం చేసుకుంటారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే చరిత్ర సృష్టించనుంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక […]
Minister Jogi Ramesh: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన విమర్శలకు మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు కూలదోసి అధికారంలోకి వచ్చినప్పుడు బాలకృష్ణ ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ చివరి కోరికను నెరవేర్చలేదని.. పార్టీని లాక్కొని సీఎం పీఠంపై మీ బావ కూర్చోలేదా అని బాలయ్యను మంత్రి జోగి రమేష్ నిలదీశారు. తెలుగు జాతికి ఎన్టీఆర్‌ను దూరం చేసింది ఎవరో చెప్పాలని సూటిగా అడిగారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు […]