ICC Test Championship Finals: క్రికెట్‌లో టెస్ట్ క్రికెట్‌లో ఉండే మజానే వేరు. కానీ కొన్నేళ్లుగా టీ20లు రాజ్యమేలుతున్నాయి. దీంతో ఐసీసీ టెస్ట్ క్రికెట్ పునరుజ్జీవం కోసం టెస్టు చాంపియన్ షిప్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ జట్ల మధ్య టెస్టు సిరీస్‌లు జరిపి పాయింట్ల ఆధారంగా రెండేళ్లకోసారి ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గత ఏడాది తొలిసారిగా జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడగా న్యూజిలాండ్ విన్నర్‌గా నిలిచింది. ప్రస్తుతం రెండో టెస్ట్ ఛాంపియన్ షిప్ జరుగుతోంది. 2023లో ఫైనల్ జరుగుతుంది. ఈ మేరకు 2023, 2025లో జరిగే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌కు ఐసీసీ వేదికలను తాజాగా ప్రకటించింది. తొలి టెస్ట్ ఛాంపియన్ షిప్ తరహాలో ద్వితీయ, తృతీయ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కూడా ఇంగ్లండ్ గడ్డపైనే జరగనున్నాయి.
Read Also:Lottery Tickets: లాటరీ టిక్కెట్ల కోసం రూ.3.5 కోట్లు ఖర్చు.. చివరకు ఎంత గెలిచాడో తెలిస్తే షాకవుతారు
2023లో ఓవల్ మైదానం, 2025లో లార్డ్స్ మైదానం టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నట్టు ఐసీసీ ప్రకటించింది. అయితే ఈ రెండు ఫైనల్స్ జరిగే తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో 84పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక, భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి.