ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 46 పరుగులతో సూర్యకుమార్ రాణించాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను కిందకు నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు. బాబర్ ఆజమ్ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన నెంబర్ వన్ స్థానాన్ని […]
Vidadala Rajini: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైద్యశాఖ మంత్రి విడదల రజినీ ప్రసంగించారు. వైఎస్ఆర్ గురించి చెప్తూ ఆమె టంగ్ స్లిప్ అయ్యారు. వైఎస్ఆర్ అంటేనే తెలుగు ప్రజలకు ఆత్మీయత అని.. ఒక మానసిక భావన అని వెల్లడించారు. ఒక మనిషి శాసిస్తే గాడితప్పిన ఒక రాష్ట్రం పట్టాలెక్కుతుంది అనడానికి బదులు ‘పట్టలేకపోతుంది’ అంటూ మంత్రి విడదల రజినీ మాట్లాడారు. తడబడిన […]
Traffic Jam Love Story: కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ జామ్ మాములుగా ఉండదు. అక్కడ పీక్ అవర్స్‌లో వాహనంపై బయటకు వెళ్లాలంటే గగనమే అని వాహనదారులు వాపోతుంటారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కారణంగా నరకం అనుభవిస్తుంటారు. అయితే అలాంటి ట్రాఫిక్ జామ్‌లో ఓ ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నేళ్ల క్రితం ఈ ప్రేమకథ చోటు చేసుకుంది. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యే ఎజిపురా ఫ్లైఓవర్ వద్ద […]
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లేటెస్టుగా నటిస్తున్న మూవీ గాడ్ ఫాదర్. ఈ మూవీలో ఓ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. తన నుంచి రాజకీయాలు దూరంగా లేవని గాడ్ ఫాదర్ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కొత్త ఐడీ కార్డు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని పీసీసీ డెలిగేట్‌గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ […]
CM Jagan: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. గత 40 నెలల్లో వ్యవసాయ రంగంలో రూ.1,28,634 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. గత మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని.. సగటున 167.99 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. రైతు భరోసా ద్వారా 52 లక్షల 38 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామన్నారు. రైతు భరోసా కింద రూ.23,875 […]
Team India: మొహాలీలో జరిగిన తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక టీమిండియా చేతులెత్తేసింది. దీంతో భారత్ ఖాతాలో మరో ఓటమి చేరింది. గత నాలుగు టీ20లలో భారత్‌కు ఇది మూడో పరాజయం కావడం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా తాజా ఓటమితో స్వదేశంలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు టీ20 మ్యాచ్‌లలో 200 ప్లస్ టార్గెట్‌లను డిఫెండ్ చేసుకోవడంలో విఫలమైన తొలి జట్టుగా టీమిండియా చెత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది జూన్ నెలలో […]
CPI Ramakrishna: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహోన్నతుల పేర్లు మార్చే అధికారం ఎవరు ఇచ్చారని సీసీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. అసెంబ్లీలో బలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం తగదన్నారు. అంతగా వైఎస్ఆర్ పేరు పెట్టుకోవాలని జగన్ భావిస్తే కొత్త యూనివర్సిటీలు నిర్మించి వాటికి పెట్టుకోవాలని సూచించారు. జగన్ నిర్ణయం […]
Team India: ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన తొలి టీ20 చూసిన తర్వాత టీమిండియా అభిమానులందరూ ఓ అంచనాకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ గెలిచేంత సీన్ అయితే లేదని పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు టీ20ల్లో మన జట్టే తోపు అన్న ఫీలింగ్‌లో ఉన్న అభిమానులే ఇప్పుడు తమ మనసు మార్చుకున్నారు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా ఉన్న మన జట్టు గురించి అంచనాలు పెట్టుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. కానీ […]
IND Vs AUS: ఆసియా కప్ వైఫల్యాన్ని భారత్ కొనసాగించింది. మొహాలీలో టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా చెలరేగి ఆడింది. మరోసారి టీమిండియా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించింది. కామెరూన్ గ్రీన్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి బలమైన పునాది వేశారు. చివర్లో మాథ్యూ వేడ్ 21 బంతుల్లో 45 పరుగులు చేయడంతో 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా […]
IND Vs AUS: మొహాలీలో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ రోహిత్ 11 పరుగులకే అవుట్ కాగా విరాట్ కోహ్లీ 2 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడి ఆసీస్ బౌలర్లకు కళ్లెం వేశాడు. […]