ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఈ సమావేశం నిర్వహించారు. కాగా, వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని మోడీ ఆదేశించారు.. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచనలు చేశారు. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్న.. మోడీ మరోసారి అధికారులను అలర్ట్ చేశారు. దేశంలో ఇంకా పూర్తిగా సెకండ్ వేవ్ కూడా ముగియలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నిన్న […]
ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ ప్రారంభం కావాల్సిన చివరి టెస్ట్‌ను (ఈసీబీ ) ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. ఈ చివరి టెస్ట్ ప్రారంభానికి మూడు గంటల ముందు భారత జట్టు ఫిజియోకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే మరిన్ని కరోనా కేసులు నమోదు అవుతాయోనన్న అనుమానంతో మ్యాచ్ రద్దు చేశారు. మరోవైపు మ్యాచ్ రద్దు ప్రకటన చేసే క్రమంలో హైడ్రామా నెలకొంది. మొదట వాయిదా అని ప్రకటించిన ఈసీబీ ఆ తర్వాత […]
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం “అన్నాత్తే” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తుండగా.. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ఈ సినిమాలో నటించడం విశేషం. కాగా, నేడు వినాయక చవితి సందర్భంగా ఉదయం చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా, సాయంత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఉదయం ఫస్ట్‌లుక్‌లో తెల్లషర్టు & పంచెకట్టుతో అందరినీ అలరించిన రజనీ.. […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈమధ్యకాలంలో సినిమాల దూకుడు పెంచాడు. మొన్ననే ‘రంగ్ దే’, ‘చెక్’ సినిమాలతో పర్వాలేదనిపించిన నితిన్.. తన తదుపరి చిత్రం ‘మాస్ట్రో’ సెప్టెంబరు 17 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. ఎం సుధాకర్ రెడ్డి మరియు నిఖిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా, నితిన్ తన కెరీర్ లో 31వ చిత్రాన్ని నేడు వినాయకచవితి సందర్బంగా పూజ కార్యక్రమాలతో ఘనంగా […]
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం చేతిలో వున్నా సినిమాలను త్వరగా పూర్తిచేసే పనిలో పడింది. కరోనా వేవ్ తో నయన్ అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా తారుమారు అయ్యిపోయాయి. ఇదిలావుంటే, నయన్ కొద్దిరోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్తలు కోలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమిళ యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార ప్రేమ కథకు త్వరలోనే ఒక హ్యాపీ ఎండింగ్ దొరకబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగిందని […]
గాయనిగా, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన చిన్మయి త్వరలోనే నటిగా సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌లు, పోస్టర్లు, టీజర్ విడుదలై ఆకట్టుకొన్నాయి. అయితే నేడు చిన్మయి పుట్టిన రోజు సందర్బంగా ఆమె ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో […]
వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలతో గణేశుడు మండపాలల్లో కొలువుదీరాడు. పలువురు సినీ ప్రముఖులు చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో మట్టితో చేసిన వినాయకుడికి భార్యతో కలిసి పూజలు చేశారు. మరోవైపు, సినీనటుడు మోహన్ బాబు విఘ్నేశ్వరుడి పూర్తి కథను చెప్పారు. ఈ కథ చెప్పాలని తన కుమారుడు మంచు విష్ణు కోరడంతో ఈ కథ చెబుతూ ఈ ఆడియో రికార్డు చేశానని […]
తెలుగు చిత్రపరిశ్రమలో పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ ఒకటి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకి కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిజానికి వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న రిలీజ్ కావాల్సి […]
ముద్దుగుమ్మ కేథరిన్ థ్రెసాకు టాలీవుడ్ లో అవకాశాలు బాగానే వున్నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లేకపోవడంతో కాస్త వెనకబాటే వుంది. ‘చమ్మక్ చల్లో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం ఈ బ్యూటీ.. ‘ఇద్దరమ్మాయిలతో, పైసా, సరైనోడు, గౌతమ్ నందా, నేనే రాజు నేనే మంత్రి, వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది. ఇదిలావుంటే, నేడు కేథరిన్ థ్రెసా పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల అప్డేట్స్ ప్రకటిస్తూ మేకర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం […]
(సెప్టెంబర్ 10న ‘మేరే అప్నే’కు 50 ఏళ్ళు పూర్తి) మనసును కట్టి పడేసే కథలు ఎవరినైనా ఆకట్టుకుంటాయి. అలాంటి కథలను పేరున్నవారు సైతం రీమేక్ చేయడానికి ఇష్టపడతారు. బెంగాలీలో తపన్ సిన్హా రూపొందించిన ‘అపన్ జన్’ ఆధారంగా హిందీలో ‘మేరే అప్నే’ చిత్రాన్ని తెరకెక్కించారు గుల్జార్. ఈ ‘మేరే అప్నే’తోనే గుల్జార్ దర్శకునిగా మారడం విశేషం! ప్రముఖ చిత్ర నిర్మాత ఎన్.సి. సిప్పీ ఈ సినిమాను నిర్మించారు. మీనాకుమారి ప్రధాన పాత్రలో రూపొందిన ‘మేరే అప్నే’ చిత్రంతోనే […]