ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఈ సమావేశం నిర్వహించారు. కాగా, వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని మోడీ ఆదేశించారు.. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచనలు చేశారు. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్న.. మోడీ మరోసారి అధికారులను అలర్ట్ చేశారు. దేశంలో ఇంకా పూర్తిగా సెకండ్ వేవ్ కూడా ముగియలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నిన్న వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుంచి 25 వరకూ మోడీ అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఈ నెల 25న ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్న మోడీ కరోనా, తీవ్రవాదంపై ప్రసంగించనున్నారు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్ పై భారత వైఖరిని ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించాక.. మోడీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి.. దీంతో వీరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.