సమంత, నాగచైతన్య వివాహబంధం తెగిపోయినట్లేనా!? ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేసిన వార్త సమంత డైవోర్స్. అయితే దీని గురించి అటు సమంత కానీ, ఇటు అక్కినేని ఫ్యామిలీగానీ ఎక్కడా స్పందించలేదు. సమంత మాత్రం మీమ్స్ తో మీడియాను ఎండగట్టే ప్రయత్నం చేసింది. తమిళంలో చేస్తున్న సినిమా తప్ప వేరే ఏ కొత్త సినిమా కమిట్ అవలేదు సమంత. అంతే కాదు వ్యక్తిగత సిబ్బందికి సెలవులు ఇచ్చి తను కూడా టూర్స్ వేస్తోంది. […]
ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుని 5వ సీజన్ లోకి అడుగు పెట్టింది ఈ షో. ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా 2వ సీజన్ కు నాని హోస్ట్ గా మారాడు. ఆ తర్వాత మూడు, నాలుగు సీజన్స్ తో పాటు ప్రస్తుతం నడుస్తున్న 5వ సీజన్ కు కూడా నాగార్జుననే […]
(సెప్టెంబర్ 8న కలసివుంటే కలదు సుఖంకు 60 ఏళ్ళు పూర్తి) ఆ రోజుల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఓ కుటుంబంలా ఉండేవారు. నిర్మాతను తల్లిగా, దర్శకుడిని తండ్రిగా భావించేవారు. హీరో పెద్దకొడుకుగా బాధ్యతలు స్వీకరించేవారు. ఇలాంటి నీతినియమాలు అన్నవి సినిమా పుట్టిన దగ్గర నుంచీ అంతటా ఉన్నవే. అవి మన దేశంలోనూ సినిమా రంగం స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో పరిఢవిల్లాయి. ఆ నాటి మేటి నటులు ఇవే నియమాలను తు.చ.తప్పక పాటించేవారు. మహానటుడు యన్.టి.రామారావు మరింతగా […]
(సెప్టెంబర్ 8న శ్రీలేఖ పుట్టినరోజు) ‘పిట్ట కొంచెం… కూత ఘనం…’ అనే మాటకు నిర్వచనం చెప్పిన ధీశాలి ఎమ్.ఎమ్.శ్రీలేఖ. పదేళ్ళు నిండాయో లేదో పదనిసలు పలికిస్తూ ఓ సినిమాకు సంగీతం సమకూర్చారు. అప్పట్లో అందరూ బాలమేధావిగా శ్రీలేఖను కీర్తించేవారు. అంత పసితనంలోనే సరిగమలతో సావాసం చేస్తూ బాణీలు కట్టిన శ్రీలేఖ అంటే అందరూ ముద్దు చేసేవారు. దాసరి నారాయణరావు ‘నాన్నగారు’తో శ్రీలేఖ తెలుగునాట తొలిసారి స్వరాలు పలికించారు. అంతకు ముందు విజయ్ హీరోగా నటించిన ‘నాలయై తీర్పు’ […]
(సెప్టెంబర్ 8న సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్ బర్త్ డే) మాధవపెద్ది సురేశ్ పేరు వినగానే బాలకృష్ణ హీరోగా రూపొందిన భైరవద్వీపం ముందుగా గుర్తుకు వస్తుంది. అందులోని పాటలన్నీ ఒక ఎత్తు, శ్రీతుంబుర నారద నాదామృతం... పాట ఒక్కటీ ఓ ఎత్తు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతసారథ్యంలో ఘంటసాల గళంలో జాలువారిన జగదేకవీరుని కథలోని శివశంకరీ శివానందల హరి... పాట స్ఫూర్తితో ఈ గీతాన్ని రూపొందించారు. ఈ పాటతో మాధవపెద్ది సురేశ్ అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. అంతకు […]
(సెప్టెంబర్ 8న ఆశా భోస్లే పుట్టినరోజు) ఒక కొమ్మకు పూచిన పూలన్నీ పూజకు పనికిరావు అనే సామెత ఉంది. పుణ్యం చేసుకున్న పూలే పూజలో చోటు సంపాదిస్తాయి అంటారు. ఒకే తల్లి పిల్లల్లో అందరూ ఒకేలా ఉండక పోవచ్చు, కానీ కొందరు తమ కళలకు సానపట్టుకొని వెలుగులు విరజిమ్ముతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రఖ్యాత గాయనీమణులు లతా మంగేష్కర్, ఆమె చెల్లెలు ఆశా భోస్లే ఉన్నారని చెప్పవచ్చు. ఇద్దరూ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ చూపిన బాటలో సంగీతసాధనతోనే […]
డ్రగ్ కేసులో ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. తాజాగా డ్రగ్స్ నిందితుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించారు. కెల్విన్, కుద్దిస్, వాహిద్ ఇళ్లలో ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహించింది. ఈమేరకు ముగ్గురు నిందితుల్ని ఈడీ కార్యాలయంకు అధికారులు తరలించారు. ముగ్గురిని వేరువేరుగా పెట్టి ఈడీ విచారణ చేస్తోంది. ముగ్గురు నిందితులు ఇళ్లల్లో లాప్ టాప్, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైస్ లని స్వాధీనపరుచుకున్నారు. ఉదయం 6 గంటలకు నిందితుడు కెల్విన్ ఇంటికి వెళ్ళిన సిఆర్ఫీఎఫ్ […]
(సెప్టెంబర్ 7న భానుమతి జయంతి) సాటిలేని మేటి నటి భానుమతి రామకృష్ణ పేరు తలచుకోగానే ముందుగా ఆమె బహుముఖ ప్రజ్ఞ మన మదిలో మెదలుతుంది… నటిగా, గాయనిగా, నర్తకిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతి సాగిన తీరు అనితర సాధ్యం… సెప్టెంబర్ 7న భానుమతి జయంతి… ఈ సందర్భంగా భానుమతి బహుముఖ ప్రజ్ఞను మననం చేసుకుందాం… నటిగానే కాదు గాయనిగానూ భానుమతి బాణీ విలక్షణమైనది… ఆమె గానం నిజంగానే తెలుగువారి మనసుల్లో […]
‘జనతా గ్యారేజ్’ సినిమాతో దర్శకుడు కొరటాల శివ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద పాత కలెక్షన్స్ ను రిపేర్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులే అవుతున్న.. ఇప్పటివరకు మిగితా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వచ్చే వారం సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను […]
విక్టరీ వెంకటేశ్ కు షష్ఠి పూర్తి అయ్యింది. అయినా యంగ్ ఛార్మ్ తగ్గకపోవడంతో హీరోగా రాణిస్తూనే ఉన్నారు. మరీ కాలేజీ స్టూడెంట్ పాత్రలు చేయకపోయినా… తన వయసును దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ మ్యాన్ పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేశ్ పిల్లలు సినిమా వాతావరణానికి దూరంగా ఉంటారు. ఆయన కుమార్తె ఆశ్రిత వరల్డ్ ఫేమస్ వంటలు చేయడంలో దిట్ట. ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తోందామె. తరచూ అందులో సరికొత్త వంటల వివరాలు అప్ […]