తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పుడు పూజా హేగ్డే, రశ్మిక మధ్య క్యాట్ రేస్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ వీరిద్దరి మధ్యే ఉంటూ వస్తోంది. వీరి డేట్స్ లేకుంటేనే దర్శకనిర్మాతలు వేరే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఒక్కో సినిమాకు వీరిద్దరి మధ్య కూడా పోటీ నడుస్తూ ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్ సినిమా కోసం వీరిద్దరి మధ్య క్యాట్ రేస్ నడిచిందట. హరీశ్ శంకర్ దర్శకత్వంలో […]
దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడానికి ముందు సోనూసుద్ సినీ నటుడుగానో.. విలన్ గానో.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానో మాత్రమే తెలుసు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనాను అరికట్టేందుకు ఉన్నట్టుండి ఒక్కసారిగా లాక్డౌన్ విధించారు. ఇది మంచి నిర్ణయమే అయినా ఆ సమయంలో కొందరి పాలిటశాపంగా మారింది. ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో సోనూసూద్ వారికి అండగా నిలిచాడు. ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసి వాళ్లను తమ సొంత […]
హుజారాబాద్ ఉప ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ప్రధాన పక్షాలు దానిని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ “విశ్వసనీయత” అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీని ద్వారా ఓటర్ల మనసు గెలవాలని గులాబీ ప్లాన్. టీఆర్‌ఎస్ ప్రయోగిస్తున్న “క్రెడిబిలిటీ కార్డుకు” విరుగుడుగా బీజేపీ “ఆత్మగౌరవం” నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. నాయకులను కొనుగోలు చేయొచ్చు […]
నటుడు, లాక్ డౌన్ రియల్ హీరో సోనూసూద్ పై రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న అర్థరాత్రి వరకూ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై దాడులు చేసిన ఆదాయపు పన్ను అధికారులు.. ఈ ఉదయం ముంబైలోని అతని ఇంటికి వెళ్లారు. లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీతో సోనూ సూద్ ఆస్తి ఒప్పందంపై దర్యాప్తు చేస్తున్నారు. పన్ను ఎగవేసినట్లు అనుమానాలున్నాయని, అందుకే ఈ సర్వే ఆపరేషన్ నిర్వహించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. నిన్న సోనూ సూద్ తో […]
ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనని టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దాసరి కిరణ్.
2005 మే 18న జీ తెలుగు ఛానెల్ ప్రసారాలు మొదలయ్యాయి. అప్పటి నుండీ ఈ ఛానెల్ లో ఫిక్షన్ షోస్ మొదలు రియాలిటీ షోస్ వరకూ రకరకాల కార్యక్రమాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఇక టాక్ షోస్, డైలీ సీరియల్స్ కు వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. అలానే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని సైతం సొంతం చేసుకుని జీ తెలుగు టీవీ ప్రసారం చేస్తూ వస్తోంది. అయితే తమలో తామే పోటీ పడేలా, […]
సినిమాల మార్కెట్ పరిధి పెరుగుతూ పోతోంది. ప్యాన్ ఇండియా మేకింగ్ కామన్ అయింది. ఈ నేపథ్యంలో ఓ సౌత్ స్టార్ హీరోకి 5 సినిమాల్లో నటించటానికి 500 కోట్లు ఆఫర్ ఇచ్చింది ఓ సంస్థ. అయినా అతగాడు నో చెప్పేశాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా…! ఆ హీరో ఎవరు? ఆఫర్ ఇచ్చిన సంస్థ ఏది? అనే కదా మీ డౌట్… అక్కడకే వస్తున్నాం.కె.జి.ఎఫ్ తో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారాడు కన్నడ […]
సెప్టెంబర్ 16న షణ్ముఖ్ జస్వంత్ పుట్టినరోజు. యూ-ట్యూబర్, ఆర్టిస్ట్ అయిన షణ్ముఖ్ ను మిత్రులంతా షణ్ణూ అని అభిమానంగా పిల్చుకుంటారు. అతను ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపెంట్ గా ఉన్నాడు. 16వ తేదీతో 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న షణ్ముఖ్ పై అతని గ్యాంగ్ కు భారీ ఆశలే ఉన్నాయి. కరెంట్ తీగలా కనిపించే షణ్ముఖ్ లో కసితో పాటు చాలా టాలెంట్ ఉందని, అతను తప్పనిసరిగా బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తాడని […]
అలనాటి మహానటి సావిత్రి గూర్చి ఈ తరానికి గొప్పగా పరిచయం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్.. అయితే ఇప్పటి తరానికి సౌందర్య గూర్చి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ సినిమా మొత్తంలో వందకు పైగా సినిమాల్లో నటించిన ఆమె విపరీతమైన అభిమానులను సంపాదించుకొంది. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న సౌందర్య.. హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మిక మరణం చెందారు. అయితే ఆమె బయోపిక్ ను తెరకెక్కించాలనే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. కానీ, ఇప్పటికి […]
బాలీవుడ్ హిట్ చిత్రం ‘అంధాదున్’కి రీమేక్ గా తెలుగులో ‘మాస్ట్రో’ వస్తున్న సంగతి తెలిసిందే.. నితిన్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించగా.. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా నటించింది. సెప్టెంబర్ 17న డిస్నీ హాట్ స్టార్‌లో రాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది. ఇక ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటిసున్న సింగర్ మంగ్లీ ‘మాస్ట్రో’ చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడింది. ‘ఈ సినిమాలో నాకు ఓ మంచి పాత్ర ఇచ్చారు. అది […]