2005 మే 18న జీ తెలుగు ఛానెల్ ప్రసారాలు మొదలయ్యాయి. అప్పటి నుండీ ఈ ఛానెల్ లో ఫిక్షన్ షోస్ మొదలు రియాలిటీ షోస్ వరకూ రకరకాల కార్యక్రమాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఇక టాక్ షోస్, డైలీ సీరియల్స్ కు వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. అలానే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని సైతం సొంతం చేసుకుని జీ తెలుగు టీవీ ప్రసారం చేస్తూ వస్తోంది. అయితే తమలో తామే పోటీ పడేలా, తమ వీక్షకులు తమ అభిమాన నటీనటులను ఎంపిక చేసుకునేలా దశాబ్ద కాలంగా ‘జీ కుటుంబం’ పేరుతో అవార్డుల కార్యక్రమాన్ని ఈ ఛానెల్ నిర్వహిస్తోంది. ఇప్పుడు 11వ సారి అవార్డుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
జీ తెలుగులో ప్రసారం అవుతున్న వివిధ కార్యక్రమాలకు, సీరియల్స్ కు సంబంధించి పలు భాగాల నామినేషన్స్ ను జీ 5 యాప్ లో, వెబ్ సైట్ లో ఉంచారు. అందులోకి ఎవరైనా వెళ్ళి తమకు ఇష్టమైన వ్యక్తులకు, కార్యక్రమాలకూ ఓట్ వేయవచ్చు. సెప్టెంబర్ 15 నుండి 30వ తేదీ వరకూ ఓటింగ్ చేసే వీలు ఉంది. అలానే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో తమకు నచ్చిన కార్యక్రమాలపై కామెంట్ పెట్టవచ్చు. పాపులర్ వ్యూవర్స్ ఛాయిస్ తో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డులనూ జీ తెలుగు అందిస్తుంది. దానికి సంబంధించి కూడా వివిధ కేటగిరీలు ఉన్నాయి. బంగారు కుటుంబం – జీ తెలుగు కుటుంబం అనే రీతిలో ఆ అనుబంధాన్ని వేడుకగా తాము జరుకోవడానికే ఈ అవార్డుల పండుగ అని నిర్వాహకులు తెలిపారు.