సినిమాల మార్కెట్ పరిధి పెరుగుతూ పోతోంది. ప్యాన్ ఇండియా మేకింగ్ కామన్ అయింది. ఈ నేపథ్యంలో ఓ సౌత్ స్టార్ హీరోకి 5 సినిమాల్లో నటించటానికి 500 కోట్లు ఆఫర్ ఇచ్చింది ఓ సంస్థ. అయినా అతగాడు నో చెప్పేశాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా…! ఆ హీరో ఎవరు? ఆఫర్ ఇచ్చిన సంస్థ ఏది? అనే కదా మీ డౌట్… అక్కడకే వస్తున్నాం.
కె.జి.ఎఫ్ తో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారాడు కన్నడ స్టార్ హీరో యశ్. దాంతో కె.జి.ఎఫ్ సీక్వెల్ స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్లుగా మారింది. కరోనా పాండమిక్ వల్ల రిలీజ్ లేట్ అయింది కానీ… లేకుంటే ఈ పాటికే థియేటర్లు దద్దరిల్లిపోతుండేవి. విషయానికి వస్తే ఇప్పుడు యశ్ కి ప్యాన్ ఇండియా స్టార్ గుర్తింపు ఉంది. సరిగ్గా ఇదే ఓ సంస్థని టెమ్ట్ చేసింది. దాంతో యశ్ ముందు ఓ సూపర్ డీల్ పెట్టింది. ఆ సంస్థ ఆషామాషీది కాదు. విశ్వవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నెట్ ఫ్లిక్స్. 5 సినిమాలు తొలి కాపీతో ఇస్తే 500 కోట్లు ఇస్తామన్నది ఆఫర్. అయితే ఈ విషయంలో ఏ విధంగానూ టెమ్ట్ కాలేదు యశ్. కూల్ గా 1000 కోట్లు అయితే ఓకె అనేశాడు. దాంతో ఆలోచనలో పడింది నెట్ ప్లిక్స్. మారిని పరిస్థితులను బట్టి ఇలాంటి ఆఫర్స్ ఇక స్టార్ హీరోలను పలకరిస్తూనే ఉంటాయి. వాటికి ఎగిరి గంతేసి ఒప్పుకుంటారా!? లేక ఆలోచించి యశ్ లా నో చెబుతారా? అన్నది చూడాలి.