ఫేస్ బుక్ ద్వారా ఓయువతిని వలలోకి దింపి, ఫొటోస్ తీసి, ఫొటోస్ తో యువతిని బ్లాక్మెయిల్ చేస్తూ కొద్దికాలంగా డబ్బులు వసూలు చేస్తున్న కిలాడి మొసగాడిని, అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో జరిగింది. బొడుప్పల్ కి చెందిన యువతిని, ఘట్కేసర్ మండలం కొర్రెముళ్ల గ్రామానికి చెందిన సూర్యకాంత్ అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా వలలో వేసుకొని, ఆ యువతితో డేటింగ్ సాగిస్తు తనకి తెలియకుండా కొన్ని ప్రయివేట్ […]
చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడని వైఎస్ఆర్.టి.పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ అన్నారు. 6 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేశాడు. కనీసం 7 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఆ కుటుంబ పేదరికమేనని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ షర్మిళ మాట్లాడుతూ.. ‘మేము దీక్ష చేసిన తరువాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది. శాంతియుతంగా మేము దీక్ష చేస్తుంటే రాత్రి 2 గంటలకు 200 మంది పోలీసులు మాపై దాడిచేశారు. […]
తనీష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మరో ప్రస్థానం’.. జానీ దర్శకత్వం వహించారు. తనీష్ జోడీగా ముస్కాన్ సేథీ నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో భానుశ్రీ మెహ్రా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆద్యంతం యాక్షన్ ఎమోషన్ హైలైట్ గా నిలవగా తనీష్ సీరియస్ ఇంటెన్స్ రోల్ ఆకట్టుకుంది. ‘అనాథనైన నాకు జీవితం యుద్ధంలానే అనిపించేది. ప్రపంచం యుద్దభూమిలా కనిపించేది’ అంటూ తనీశ్ తన పాత్రని వివరించిన తీరు బాగుంది. […]
బాలీవుడ్ లోని ప్రముఖులంతా నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోవడం కామన్ గా మారింది. గతంలోనే కొందరు సెలబ్రెటీలు వివాదాల్లో ఇరుక్కుకొని జైళ్లకు వెళ్లిన సంఘటనలున్నాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా సైతం పలు అభియోగాల కింద కేసుల్లో ఇరుక్కున్నారు. అయితే రాజ్ కుంద్రా అశ్లీల సినిమాల రాకెట్ ను నడుపుతున్నారని పోలీసులు అతడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం తాజాగా సంచలనంగా మారింది. దీంతో బాలీవుడ్లో మరోసారి […]
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. అంతేకాదు సెప్టెంబర్ 25 వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. చీటర్ సురేష్ తో సంబంధాలపై జాక్వెలిన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఈడీ అధికారులు ఇదివరకే ప్రశ్నించగా.. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ […]
‘పలాస 1978’తో అందరి దృష్టినీ ఆకర్షించిన రక్షిత్ అట్లూరి మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ తో కలసి ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ ‘శశివదనే’ పేరుతో ఈ సినిమా తీస్తున్నారు. కోమలీ ప్రసాద్ హీరోయిన్. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. టీజర్‌లో ‘కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు. జాతిని, నీతిని నిర్మించలేరు’ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన […]
బిగ్ బాస్ సీజన్ 5 రెండోవారంలో ఉంది. అయితే తాజాగా బిగ్ బాస్ 5 లాంఛింగ్ ఎపిసోడ్ టిఆర్ పి రేటింగ్స్ వచ్చాయి. 15.7 రేటింగ్ సాధించింది బిగ్ బాస్ 5 ఆరంభ ఎపిసోడ్. నిజానికి గత ఏడాది సీజన్ 4 ప్రారంభ ఎపిసోడ్ 18.5, సీజన్ 3 తొలి రోజు 17.9 రేటింగ్ సాధించింది. వాటితో పోలిస్తే తక్కువ రేటింగ్ సాధించినప్పటికీ తన పోటీదారుల కంటే ఎంతో ఎత్తున ఉన్నాడు బిగ్ బాస్. ఈ రేటింగ్ […]
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్ యాక్టివిటీ లో బిజీగా ఉంది యూనిట్. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడి చివరకు 24న ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 19 న జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్‌కు ముఖ్య […]
లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో వున్న విషయం తెలిసిందే.. ఈమధ్య కాలంలో పబ్లిక్ లో బాహాటంగానే తిరుగుతున్నారు. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, విఘ్నేశ్ శివన్ తన ప్రియురాలు నయన్ ఇంట్లో ప్రత్యేక్షమైయ్యాడు. నయన్ తల్లి ఓమన కురియన్ పుట్టిన రోజు సందర్బంగా విఘ్నేశ్ ఆమె ఇంటికి విచ్చేశారు. చెన్నై నుండి వీరిద్దరూ కలిసి కేరళ వెళ్లారు. అక్కడ సరదాగా అమ్మ […]
‘పొరుగుంటి పుల్లకూర రుచి’ అన్నట్లుగా మనం మన విషయాల కంటే పక్కింటి సంగతులను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉంటాం. పక్కోడి విషయాలు తెలుసుకోవడంలో ఉన్న కిక్కే వేరప్పా అన్నట్లు కొందరు అదే పనిలో ఉంటారు. మరికొందరైతే చిన్న విషయాన్ని కూడా ఏదో అద్భుతంగా చిత్రీకరిస్తుంటారు. ఇంకొందరైతే చాలా స్పెషల్ గా ఉంటారు. అసలు ఏం లేకపోయినా ఏదో ఒక పుకారు సృష్టించి ట్రెండింగ్ లోకి తీసుకొస్తూ ఉంటారు.అందుకే మన దేశంలో ఇతరుల జీవితాల్లోకి తొంగిచూసే రియాలిటీ షో […]