రశ్మిక మీద పూజదే పైచేయి అయిందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పుడు పూజా హేగ్డే, రశ్మిక మధ్య క్యాట్ రేస్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ వీరిద్దరి మధ్యే ఉంటూ వస్తోంది. వీరి డేట్స్ లేకుంటేనే దర్శకనిర్మాతలు వేరే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఒక్కో సినిమాకు వీరిద్దరి మధ్య కూడా పోటీ నడుస్తూ ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్ సినిమా కోసం వీరిద్దరి మధ్య క్యాట్ రేస్ నడిచిందట. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా కోసం జరిగిన హీరోయిన్ల వేటలో చివరకు పూజా హేగ్డే ఎంపిక ఖరారు అయిందట.
సెంటిమెంట్ వర్కవుట్
Also Read
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
- Suriya - Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
నిజానికి మైత్రీ మూవీస్ వారి వద్ద రశ్మిక డేట్స్ ఉన్నాయట. అయితే దర్శకుడు హరీశ్ శంకర్ పవన్ సరసన పూజా హేడ్గే అయితే బాగుంటుందని కోరారట. అంతకు మందు హరీశ్ తో ‘దువ్వాడ జగన్నాథమ్, గద్దలకొండ గణేశ్’ సినిమాల్లో నటించింది పూజా హేగ్డే. అవి రెండూ హిట్. దాంతో పూజ హరీశ్ కి లక్కీ మస్కట్ గా మారింది. అందుకే పూజకే మొగ్గు చూపాడు హరీశ్. నిజానికి పూజ కూడా ఎంతో బిజీగా ఉంది. సల్మాన్ తో ‘భాయీజాన్’, విజయ్ తో ‘బీస్ట్’, మహేశ్, త్రివిక్రమ్ సినిమా ఉన్నాయి. అయినా హరీశ్ శంకర్ పట్ల కృతజ్ఞతా భావంతో పాటు పవన్ హీరో కావడంతో డేట్స్ ఎడ్జస్ట్ చేసి సహకరిస్తోంది. డిజె కి ముందు పూజ నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. పూజా హేగ్డే స్టార్ హీరోయిన్ గా ఎదగటానికి బీజం వేసిన సినిమా ‘డిజె’. అందుకే హరీశ్ అంటే పూజకు ప్రత్యేకమైన అభిమానం. ఇక మైత్రీ సైతం పూజకు భారీ పారితోషికం ఇవ్వబోతోంది. దీంతో పాటు తన ప్రధాన పోటీదారు రశ్మికపై పైచేయి అని నిరూపించుకునే ఛాన్స్. ఎలా వదులుతుంది? అందుకే పవన్, హరీశ్ సినిమాలో భాగం అవటానికి డేట్స్ అన్నీ ఎడ్జెస్ట్ చేసి మరీ సినిమా చేస్తోంది. మరి పూజ ఎత్తుకు రశ్మిక ఎలాంటి పై ఎత్తు వేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్‌లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!