‘తను నేను’, ‘పేపర్ బాయ్’ సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ రీసెంట్‌గా ‘ఏక్ మినీ కథ’తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ యంగ్ హీరోతో దర్శకురాలు నందినీ రెడ్డి సినిమా ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. బేబీతో హిట్ కొట్టిన నందినీ రెడ్డి ఆ తర్వాత ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. అయితే నాగచైతన్యతో ఓ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆగిపోయింది. దుబాయ్ లో నెల రోజుల పాటు సాగిన భారీ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ మొదలైంది కానీ వెంటనే కరోనా ప్రభావం కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇదిలా ఉంటే, సర్కారు వారి పాట విలన్ విషయంలో కన్ఫ్యూజన్ క్లారిటీ వచ్చినట్లు […]
టీఆర్ఎస్ కు దూరం అయిన మాజీ మంత్రి ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ కావటంతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. హుజురాబాద్ లో ఉపఎన్నిక తప్పదనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన గులాబీ పార్టీ.. పూర్తి పట్టు కోసం వేగంగా పావులు కదుపుతోంది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థే గెలిచేలా ఇప్పటికే నేతలు బాధ్యతలు తీసుకోని గ్రౌండ్ లెవల్ లో తమ పనిని మొదలుపెట్టేశారు. ఈటెల బీజేపీలోకి వెళ్లడం ఖాయం […]
నటుడు ఉత్తేజ్ పేరు వింటే ఇప్పటికీ ఆయన తొలి చిత్రం శివలోని యాదగిరి పాత్రనే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా మొదటి సినిమాలోనే కనిపించింది కొన్ని నిమిషాలే అయినా, తన ప్రతిభతో ఆకట్టుకున్నారు ఉత్తేజ్. రామ్ గోపాల్ వర్మ అప్పటి నుంచీ తాను రూపొందించిన పలు చిత్రాలలో ఉత్తేజ్ కు అవకాశాలు కల్పించారు. గాయం, అనగనగా ఒకరోజు చిత్రాలలోనూ ఉత్తేజ్ యాదగిరిగానే కనిపించి ఆకట్టుకోవడం విశేషం. ఇలా ఒకే పాత్రలో వేర్వేరు చిత్రాలలో నటించడం అన్నది ఉత్తేజ్ […]
బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తాప్సీ కేరాఫ్ అయ్యారు. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘రష్మీ రాకెట్’. ఇందులో గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మీగా తాప్సీ కనిపించనుంది. అకర్ష్ ఖురానా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విడుదలపై బీటౌన్‌లో ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాత ఓ నిర్ణయానికి వచ్చినట్లు త్వరలోనే అధికారిక […]
కరోనాతో మృతిచెందిన వారి పిల్లలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఇదివరకే తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనాతో అనాధలుగా మారిన పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే బీమా నిబంధనల్లో సవరణ చేశారు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు రూ. 10 లక్షల పరిహారం ఇచ్చే నిబంధనల్లో సవరణ చేశారు. ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలన్న నిబంధనను తొలగించారు. నిబంధన తొలగింపుతో అదనంగా మరికొంత మంది పిల్లలకు ప్రయోజనం దక్కనుంది. […]
దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం తనకంటూ ఓ స్థానం సంపాదించారు. అంతర్జాతీయ వేదికలపై సైతం మణిరత్నం హవా విశేషంగా వీచింది. ఇంతకూ మణిరత్నంలో అంత గొప్పతనం ఏముందబ్బా? అంటూ ఎకసెక్కేలు చేసేవారు ఉన్నారు. ఎందుకంటే చాలా రోజులుగా మణిరత్నం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటలేకపోతున్నాయి. పైగా ఆయన నుండి వస్తున్న చిత్రాలలోనూ పాతకథలే కనిపించాయి. దాంతో ఈ తరం జనం మణి సినిమాలను అంతగా పట్టించుకోవడం లేదు. అందువల్ల నవతరం ప్రేక్షకులకు మణిరత్నం చిత్రాల్లోని […]
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో నేడు వైఎస్ షర్మిల పర్యటించనుంది. వెల్దుర్తి మండలంలోని శేరీల గ్రామంలో ఉద్యోగం రావట్లేదని మనస్తాపం చెంది ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రాజు, మురళీల కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. వెల్దుర్తిలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం అక్కడే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలతో ఉదయం 7 గంటలకే వెల్దుర్తి రానుంది. షర్మిల పర్యటన కోసం అనుచరులు ఏర్పాట్లు పూర్తచేశారు. తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన షర్మిల […]
సీనియర్ నటుడు మోహన్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు నిర్మిస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా టీజర్‌ని ఈ నెల 4న విడుదల చేయనున్నారు. మోహన్‌బాబు 30 ఏళ్ల కిందట నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ విడుదలైన రోజు అది. ఆ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ప్రత్యేకత వల్లే ఈ నెల […]