బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తాప్సీ కేరాఫ్ అయ్యారు. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘రష్మీ రాకెట్’. ఇందులో గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మీగా తాప్సీ కనిపించనుంది. అకర్ష్ ఖురానా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విడుదలపై బీటౌన్‌లో ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాత ఓ నిర్ణయానికి వచ్చినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. ఇక భారత కికెటర్ మిథాలి రాజ్ బయోపిక్‌లోనూ ఆమె క్రికెటర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.