సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆగిపోయింది. దుబాయ్ లో నెల రోజుల పాటు సాగిన భారీ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ మొదలైంది కానీ వెంటనే కరోనా ప్రభావం కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇదిలా ఉంటే, సర్కారు వారి పాట విలన్ విషయంలో కన్ఫ్యూజన్ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రకు పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా ఈ పాత్రకు సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ ను తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపైనా అధికారిక ప్రకటన వచ్చేలా కనిపిస్తోంది. అర్జున్ ఇటీవల పలు సినిమాల్లో కీలక పాత్రలో, విలన్ పాత్రల్లో నటించి మెప్పిస్తున్న విషయం తెలిసిందే.