‘తను నేను’, ‘పేపర్ బాయ్’ సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ రీసెంట్‌గా ‘ఏక్ మినీ కథ’తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ యంగ్ హీరోతో దర్శకురాలు నందినీ రెడ్డి సినిమా ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. బేబీతో హిట్ కొట్టిన నందినీ రెడ్డి ఆ తర్వాత ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. అయితే నాగచైతన్యతో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగగా, చైతు ‘థ్యాంక్యూ’ సినిమాతో పాటుగా మరో సినిమా చర్చల్లో బిజీగా ఉన్నాడు. దీంతో ఈ గ్యాప్‌లో హీరో సంతోష్ శోభన్‌కు నందినీ కథ చెప్పినట్లు తెలుస్తోంది.