మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో నేడు వైఎస్ షర్మిల పర్యటించనుంది. వెల్దుర్తి మండలంలోని శేరీల గ్రామంలో ఉద్యోగం రావట్లేదని మనస్తాపం చెంది ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రాజు, మురళీల కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. వెల్దుర్తిలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం అక్కడే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలతో ఉదయం 7 గంటలకే వెల్దుర్తి రానుంది. షర్మిల పర్యటన కోసం అనుచరులు ఏర్పాట్లు పూర్తచేశారు. తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన షర్మిల జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.