కరోనా వల్ల లాక్‌డౌన్ ఆంక్షలను ఢిల్లీలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మందుప్రియులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మద్యం హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది. ఆన్‌లైన్‌లో దేశీయ, విదేశీ మద్యం విక్రయించుకునే వెసలుబాటు కల్పించింది. వెబ్‌పోర్టల్ లేదా యాప్ ద్వారా మద్యం ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. భారతీయ కంపెనీలకు చెందిన మద్యం కానీ.. విదేశాలకు చెందిన మద్యాన్ని అయినా ఇంటికి డెలివరీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే హాస్టళ్లు, ఆఫీసులు, […]
వరంగల్ సెంట్రల్ జైల్ తరలింపుకు రంగం సిద్ధమైంది. కేంద్ర కారాగారం స్థలాన్ని , వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. జైలు ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జైలు స్థలంలో ఎంజీఎంను తరలించి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది రానున్నారు. డీజీ సూచనలతో వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న 960 మంది […]
పాకిస్తాన్‌లో చిక్కిన తెలుగు యువకుడు హైదరాబాద్‌వాసి ప్రశాంత్ సోమవారం అక్కడి జైలు నుంచి విడుదలయ్యారు. 2017 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ నుంచి మిస్సైన ప్రశాంత్ నాలుగేళ్లగా పాకిస్తాన్‌లో అడుగుపెట్టి బందీగా మారాడు. కాగా ప్రశాంత్ నేడు హైదరాబాద్ చేరుకోనున్నాడు. హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేస్తున్న ప్రశాంత్.. సీజర్ లాండ్ లో తన ప్రియురాలిని కలవడానికి వస్తున్న క్రమంలో ప్రశాంత్ పాక్ కు చిక్కాడు. కాగా, వాఘా సరిహద్దులో ప్రశాంత్ ను భారత్ […]
తమిళ్ స్టార్ హీరో అజిత్ కు బాంబు బెదిరింపు రావడం కోలీవుడ్ లో కలకలం రేపింది. ఆయన ఇంటిలో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అజిత్ ఇంటికెళ్ళి జాగిలాలతో తనిఖీలు చేశారు. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వినోద్ తో ‘వాలిమై’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో హుమా ఖురేషి […]
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో పూర్ణ నటిస్తోంది. ఈ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాను చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన […]
మైలార్ దేవుపల్లి వట్టేపల్లి లో ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ విషయం ఒకరికొకరికి తెలియడంతో ఘర్షణకు దారితీసింది. వట్టేపల్లి నైస్ హోటల్ వద్ద ఉమర్ అనే యువకునిపై మొయిన్ దాడి చేశాడు. పథకం ప్రకారం ఇంట్లో నుంచి కత్తి తీసుకొని వచ్చిన మొయిన్ పై కత్తితో దాడి చేశాడు. ఉమర్ కుడి భుజంపై కత్తి పోట్లు కాగా, తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఉమర్ ను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మొయిన్ పై […]
ఓ వైపు నైరుతీ రుతుపవనాలు జూన్ 3న కేరళలోకి ప్రవేశిస్తాయనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోహిణి కార్తె ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా ఎండ తీవ్రత కొనసాగింది. వివిధ జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల అధికంగా 35.3 నుంచి 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలి తక్కువగా వీయడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కాగా సముద్రం వైపు నుంచి దక్షిణ గాలులు రాష్ట్రం మీదుగా […]
తెలంగాణలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్లైన్ తరగతులు లాక్ డౌన్ పొడిగింపుతో వాయిదా పడ్డాయి. మరోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ పేర్కొన్నారు. రేపటి నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు. ఆన్‌లైన్ తరగతుల ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని జలీల్ తెలిపారు.
తెలుగు సినిమా చరిత్రలో తన కంటూ ఓ పేజీకి లిఖించుకున్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. దాదాపు 40కి పైగా చిత్రాలను రూపొందించిన ఆయన తన చిత్రాలకు తానే సెన్సార్ ఆఫీసర్. అందుకే ఆయన చిత్రాలంటే సెన్సార్ సభ్యుల కత్తెరకు పని ఉండదనే ప్రచారం బాగా జరిగిపోయింది. సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలను చూసే అదృష్టాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి తెలుగు వారికి కలిగించారంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన సినిమాల్లో యాక్షన్ పార్ట్ ఉండదా అంటే ఉంటుంది. రొమాంటిక్ […]