ఇటీవలే ఓటిటి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా వెబ్ సిరీస్ లలో రాణిస్తోంది. రీసెంట్ గా విడుదల అయిన ‘11థ్ అవర్’, ‘నవంబర్ స్టోరీ’లతో తమన్నాకు మంచి ఆదరణ లభించింది. దీంతో ఆమె మరిన్ని వెబ్ సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈమధ్య గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ బోల్డ్ పాత్రలపై ఫోకస్ పెడుతుందట. అలాంటి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం తమన్నా నితిన్ […]
ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం జాతీయ విద్యావిధానంపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాతృభాష ప్రాముఖ్యతపై మాట్లాడారు. భావ వ్యక్తీకరణకు మాతృభాషపై పట్టు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా సీబీఎస్ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీన్ని అమలు చేయాలంటే పాఠశాలల్లో కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఇందుకోసం సహకార వ్యవస్థలా మారాలి. ఈ విధానంలో వసతులు ఎక్కడ ఉన్నా వాటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది అని సూచించారు. […]
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. రోజురోజుకు పెరుగుతున్న రేటుతో పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ మార్క్ దాటి దూసుకెళ్తున్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100.98, డీజిల్ రూ.92.99కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.52 గా ఉండగా.. డీజిల్ రూ. 95.91 […]
ఏపీ రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ జూనియర్ డాక్టర్లు (జూడా) సంఘం నేటి నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఫ్రంట్‌లైన్ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కొవిడ్ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని డిమాండు చేస్తున్నారు. కాగా ప్రభుత్వంతో జూడాలు రెండు సార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు ఆరోగ్య మంత్రి, […]
ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్. ‘తను నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంతోష్ ఆ తర్వాత ‘పేపర్ బాయ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ ఇటీవల ఓటీటీ ద్వారా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. దీంతో ఈ హీరోకి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ కుర్ర హీరో దర్శకుడు మారుతితో ఓ సినిమా […]
తెలంగాణలో ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు తెలంగాణలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సీడ్ & ఫెర్టిలైజర్ దుకాణాలపై జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరు దుకాణాలలో తనిఖీలు చేపట్టగా.. సుమారు 8 లక్షల విలువైన అనుమతుల్లేని పత్తి విత్తనాలను పట్టుకున్నారు. […]
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు జిల్లా పోలీసులు. 60 లక్షల విలువ చేసే నాలుగున్నర క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొని, ఆరుగురి అరెస్ట్ చేశారు. కర్ణాటక నుండి తెలంగాణకు తీసుకోవచ్చి నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అమ్ముతున్నారు. కాగా జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరంతా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులుగా.. మీడియా సమావేశంలో ఎస్పీ భాస్కరన్ వివరాలు వెల్లడించారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు డా.రాజశేఖర్ కథానాయకుడిగా లలిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శేఖర్’.. ఆయన కెరీర్ లో 91వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా లుక్‌ని ఇప్పటికే విడుదల చేశారు. ఇందులో ఇద్దరు కథానాయికలు నటిస్తారు. వీరిలో ఒకరు ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ ముస్కాన్ నటిస్తుండగా.. మరో నాయికగా మలయాళ భామ అను సితార ఎంపిక అయింది. కాగా, ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఎమ్.ఎల్.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం […]
గత యేడాది ఆహాలో స్ట్రీమింగ్ అయిన జోహార్ మూవీలో శుభలేఖ సుధాకర్… సుభాష్ చంద్రబోస్ అనుయాయుడి పాత్రను పోషించి మెప్పించాడు. అనాధ బాలల కోసం అహరహం శ్రమించే పాత్ర అది. అలానే ఈ యేడాది విడుదలైన పలు చిత్రాలలోనూ సుధాకర్ నటించారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రంలో సాధువుగా నటించిన సుధాకర్… ఆ తర్వాత అలీ హీరోగా నటించిన లాయర్ విశ్వనాథ్లోనూ కీలక పాత్ర పోషించారు. అలానే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్లో ముగ్గురమ్మాయిలు నివాసం […]
లాక్ డౌన్ వల్ల విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరో నెల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశమే లేదు. జనాలు కూడా లాక్ డౌన్ వల్ల ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్ ,నెట్ ఫ్లిక్స్ , ఆహా వంటి ఓటీటీ సంస్థలు సినిమాలకు గాలం వేస్తున్నాయి. ఇదిలావుంటే, ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాతో కలిసి ‘సామ్ జామ్’ […]