ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్. ‘తను నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంతోష్ ఆ తర్వాత ‘పేపర్ బాయ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ ఇటీవల ఓటీటీ ద్వారా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. దీంతో ఈ హీరోకి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ కుర్ర హీరో దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. రెండు, మూడో నెలల్లోనే ఈ సినిమా పూర్తి చేయనున్నాడట మారుతి. ఇక ఈ సినిమాలో ఇదే వరకే మారుతి దర్శకత్వంలో ‘మహానుభావుడు’ సినిమాలో మెరిసిన మెహ్రిన్ ఈ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. కాగా ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి ముహూర్తం కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం ‘ఎఫ్ 2’ సీక్వెల్ సినిమాలోనూ నటిస్తోంది.