తెలంగాణలో ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు తెలంగాణలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సీడ్ & ఫెర్టిలైజర్ దుకాణాలపై జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరు దుకాణాలలో తనిఖీలు చేపట్టగా.. సుమారు 8 లక్షల విలువైన అనుమతుల్లేని పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ముందుగానే అప్రమత్తమైన మరో మూడు దుకాణాల యజమానులు షాప్స్ మూసివేసి పరారైయ్యారు. ప్రస్తుతం పోలీసులు వారిపై కూడా వివరాలు సేకరించే పనిలో పడ్డారు.