సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు జిల్లా పోలీసులు. 60 లక్షల విలువ చేసే నాలుగున్నర క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొని, ఆరుగురి అరెస్ట్ చేశారు. కర్ణాటక నుండి తెలంగాణకు తీసుకోవచ్చి నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అమ్ముతున్నారు. కాగా జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరంతా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులుగా.. మీడియా సమావేశంలో ఎస్పీ భాస్కరన్ వివరాలు వెల్లడించారు.