టిక్ టాక్ యాప్ పై నిషేధాన్ని అమెరికా ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా మొదటి దశ మహమ్మారి ప్రబలిన వెంటనే చైనాకు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్న అనేక నిర్ణయాలను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పునః సమీక్ష చేపట్టినట్లు వైట్ హౌస్ వర్గాలు ధృవీకరించాయి. టిక్ టాక్ యాప్ తోపాటు.. వుయ్ ఛాట్ తదితర యాప్ లలో భద్రతాపరమైన అంశాలను వాణిజ్య విభాగం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రైవసీ, సెక్యురిటీకి సంబంధించిన విషయాలపై వాణిజ్య విభాగం నివేదిక ఇచ్చిన తర్వాత […]
బాలయ్య పుట్టిన రోజు వేడుకలునేడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని హిందూపురంలోని ఆయన నివాసం వద్ద తెదేపా నాయకులు, అభిమానులు జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. వాహనం దగ్ధంఅనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఓబులేసు కోన మలుపు వద్ద సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. పాస్ పోర్టు సేవలు పునఃప్రారంభంఅనంతపురం జిల్లాలో ఈనెల 11 నుంచి ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్ పోర్టు […]
శ్రీకాకుళం జిల్లాలో నేడు ఐదు సంవత్సరాల లోపు బిడ్డలున్న తల్లులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరగనుంది. కాగా విదేశాల్లో చదువు, ఉద్యోగం నిమిత్తం వెళ్లేవారికి సైతం కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ అందించనున్నారు. సంబంధిత పత్రాలు చూపించిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. విదేశాలకు వెళ్లేవారికి శ్రీకాకుళం నగరపరిధిలోని దమ్మలవీధి పట్టణ ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఇక నెల్లూరు జిల్లాలోను అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు , […]
ప్రముఖ గాయకుడు, స్వర్గీయ ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే ఆయనకు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే చాలా కాలంగా ఘంటసాల రత్నకుమార్ కిడ్నీ సమస్యతో డయాలసిస్ పై ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘంటసాల అమర గాయకుడిగా పేరు గడిస్తే, ఆయన కుమారుడైన రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్ళలో తన […]
ప్రస్తుతం భారతీయ చలనచిత్రసీమలో నటవారసుల హవా విశేషంగా వీస్తోంది. భారతీయ చిత్రసీమలో నటవారసత్వానికి బీజం వేసిన వారు మహానటుడు పృథ్వీరాజ్ కపూర్. దక్షిణాదిన అదే బాటలో సాగారు నటరత్న యన్టీఆర్. ఆ తరువాత నార్త్ లోనూ, సౌత్ లోనూ ఎందరో నటీనటులు తమ వారసులను చిత్రసీమలో ప్రవేశ పెట్టారు. అనేక మంది స్టార్స్ గా విజయం సాధించారు. తమ కన్నవారి పేరు నిలిపారు. అలా జయకేతనం ఎగురవేసిన నటవారసుల్లో నందమూరి బాలకృష్ణ స్థానం ప్రత్యేకమైనది. 1974లో ‘తాతమ్మకల’తో […]
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా గత 12న మూతపడిపోయిన పాస్ పోర్టు కేంద్రాలు నేటి నుంచి యధావిధిగా పునః ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలు పగటిపూట ఎత్తేసిన విషయం తెలిసిందే. దీంతో పాస్ పోర్టు కేంద్రాలు ఈరోజు నుంచి పనిచేస్తాయని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి బాలయ్య తెలిపారు. అత్యవసరంగా విదేశాలకు వెళ్లాలనుకునే వారికీ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. సాధారణ సమయాల్లో పాస్ పోర్టు సేవా కేంద్రాలు పని చేయనున్నాయి.
దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కాగా థర్డ్ వేవ్ లో ఎక్కువ శాతం మంది చిన్నారులు వైరస్ బారిన పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో వైరస్ లక్షణాలను ఎలా గుర్తించాలి, ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మరిముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకపోవటమే […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో 28వ చిత్రాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వింటేజ్ బైక్‌పై బ్లాక్ షర్ట్ ధరించి, చేతిలో ఓ సూట్‌కేసు పట్టుకొని స్టైలీష్‌గా కూర్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ పై మైత్రీ మూవీ మేకర్స్ లోగో కూడా […]
నూతన ఐటీ నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తుది వార్నింగ్ అనంతరం ట్విట్టర్ వెనక్కి తగ్గింది. మొదట ససేమిరా అన్న ట్విట్టర్.. తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను పాటించేందుకు సిద్ధమేనని తెలిపింది. అయితే, వాటి అమలుకు మరికొంత సమయం కావాలని కోరినట్లు సమాచారం. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఐటీ చట్టాల అమలుకు కొంత సమయం కావాలని ట్విట్టర్ యాజమాన్యం కోరింది. కాగా చివరి అవకాశం ఇస్తూ కేంద్రం రాసిన ఘాటు లేఖకు […]
గుంటూరు జిల్లా రొంపిచర్లలో విషాదం చోటుచేసుకుంది. భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు నా చావుకు భార్యే కారణం అని లేఖ రాసి ఇంట్లో భర్త ఉరేసుకున్నాడు. రొంపిచర్లకు చెందిన ఏలికా రామకృష్ణారావు(32)కు ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన యువతితో వివాహమయ్యింది. తరచూ దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఈపూరు స్టేషన్ లో భర్త, అతని బంధువులమీద కేసు పెట్టింది. ఈ క్రమంలో […]