టాలీవుడ్ సీనియర్ నటుడు డా.రాజశేఖర్ కథానాయకుడిగా లలిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శేఖర్’.. ఆయన కెరీర్ లో 91వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా లుక్‌ని ఇప్పటికే విడుదల చేశారు. ఇందులో ఇద్దరు కథానాయికలు నటిస్తారు. వీరిలో ఒకరు ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ ముస్కాన్ నటిస్తుండగా.. మరో నాయికగా మలయాళ భామ అను సితార ఎంపిక అయింది. కాగా, ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఎమ్.ఎల్.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది.