గత యేడాది ఆహాలో స్ట్రీమింగ్ అయిన జోహార్
మూవీలో శుభలేఖ
సుధాకర్… సుభాష్ చంద్రబోస్ అనుయాయుడి పాత్రను పోషించి మెప్పించాడు. అనాధ బాలల కోసం అహరహం శ్రమించే పాత్ర అది. అలానే ఈ యేడాది విడుదలైన పలు చిత్రాలలోనూ సుధాకర్ నటించారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?
చిత్రంలో సాధువుగా నటించిన సుధాకర్… ఆ తర్వాత అలీ హీరోగా నటించిన లాయర్ విశ్వనాథ్
లోనూ కీలక పాత్ర పోషించారు. అలానే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్
లో ముగ్గురమ్మాయిలు నివాసం ఉండే ఇంటి ఓనర్ గా, వారికి సహకారం అందించే చక్కని పాత్రలో కనిపించారు. ఆ మధ్య వచ్చిన జాతిరత్నాలు
లో మేడ్ ఇన్ ఇండియా – మేకిన్ ఇండియాను ప్రోత్సహించే ఓ గొప్ప పారిశ్రామిక వేత్త పాత్రకు శుభలేఖ
సుధాకర్ జీవం పోశారు. తాజాగా ఆయన నటించిన మరో సినిమా ఈ నెల 11న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. అర్థ శతాబ్దం
మూవీలో శుభలేఖ
సుధాకర్ మంత్రి రంగారావు పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ సినిమా గురించి శుభలేఖ
సుధాకర్ మాట్లాడుతూ, పరిస్థితులు, ప్రాముఖ్యతలు మారిపోవడం వల్ల మంచి చేయాలనుకున్న వ్యక్తులు కూడా మంచిని సకాలంలో చేయలేకపోతున్నారు. ప్రతి వ్యక్తి నా బాధ్యత అని ఫీలై చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. అదే `అర్ధ శతాబ్దం` మూవీ
అన్నారు. కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయికుమార్, కృష్ణప్రియ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించారు.