ఇటీవలే ఓటిటి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా వెబ్ సిరీస్ లలో రాణిస్తోంది. రీసెంట్ గా విడుదల అయిన ‘11థ్ అవర్’, ‘నవంబర్ స్టోరీ’లతో తమన్నాకు మంచి ఆదరణ లభించింది. దీంతో ఆమె మరిన్ని వెబ్ సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈమధ్య గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ బోల్డ్ పాత్రలపై ఫోకస్ పెడుతుందట. అలాంటి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం తమన్నా నితిన్ తో అంధదూన్ సినిమా రీమేక్ ‘మాస్ట్రో’ లోను ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది. టబు ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆ పాత్ర తమన్నా చేస్తుండటంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక గోపీచంద్ తోను ‘సీటిమార్’ సినిమాలో నటించింది తమన్నా.. ఈ సినిమా ఆగస్టులో విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది.