కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గుడ్ లక్ సఖీ’. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో సుధీర్ చంద్ర పాదిరి దీనిని నిర్మించారు. దిల్ రాజు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు. విశేషం ఏమంటే తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను నిర్మించారు. కీర్తి సురేశ్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీని జూన్ 3న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ […]
తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ కీలక పాత్రలు పోషించిన ‘రాక్షసన్’ మూవీ ఘన విజయం సాధించింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా తమిళ భాషలో 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. ఇదే సినిమాను తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా రీమేక్ చేశారు. ఇక్కడా ఈ సినిమా చక్కని విజయాన్ని సాధించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల్లో మంచి […]
ఈ నెల 4న నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో తొలకరి వర్షాలు కురిశాయి. కాగా ఆ తర్వాతి నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. నిన్న నల్గొండ జిల్లాలో అత్యధికంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో వాన జాడే లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు నిజానికి టాలీవుడ్ లో పెద్దంత క్రేజ్ లేదు. సూర్య, కార్తీకి మొదటి నుండి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో వారి సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతున్నాయి. వాటితో పాటే ధనుష్ సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అయినా ‘రఘువరన్ బి.టెక్’ మాత్రమే ఇక్కడ మంచి విజయం సాధించింది. అయితే ధనుష్ తో పాన్ ఇండియా మూవీ తీస్తే కనక వర్షం కురవడం ఖాయం. అందుకే తెలుగు నిర్మాతలు ధనుష్ తో […]
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఎస్‌ఐ.. ఓ బాలికపై తుపాకీతో బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నై కాశిమేడు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ స్టేషన్ స్పెషల్ టీంలో ఎస్‌ఐగా పనిచేస్తున్న సతీష్‌కుమార్ ఇటీవల మాధవరంలో భద్రత విధులు నిర్వహించాడు. ఆ సమయంలో అక్కడి రేషన్ దుకాణంలో పనిచేస్తున్న బాలికపై కన్నేశాడు. ఆ బాలికను లొంగదీసుకునేందుకు ఆమె తల్లి, పెద్దమ్మ సహకరించడంతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తాను చెప్పినట్టు వినకుంటే తండ్రి, తమ్ముడిని కేసుల్లో […]
అలనాటి అందాల హీరోయిన్ రాధ కూతురే ‘కార్తీక నాయర్’.. 17 ఏళ్లకే ‘జోష్’ చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తమిళంలో ‘కో’ ( తెలుగులో రంగం) సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో యూత్‌లో కార్తీకకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆతరువాత మలయాళ, కన్నడ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆతర్వాత కార్తీకకు ఆఫర్లు […]
ప్రధాని మోడీ నేడు అయోధ్య రామాలయ అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ సమీక్షించనున్నారు. ఈ మీటింగ్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆలయ పనులు వేగంగా జరుగుతుండగా.. మందిర నిర్మాణానికి కావాల్సిన నిపుణులు పూర్తిగా అందుబాటులోకి వచ్చారు. సాంకేతికంగా చేయాల్సిన పనులన్నీ పూర్తయ్యాయి. అయితే తాజాగా మోడీ రామాలయ పనులు జరుగుతున్న తీరుపై పూర్తిస్థాయి రివ్యూ చేయనున్నారు. కాగా రామమందిరం నిర్మాణం […]
నేడు విశాఖపట్నంకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఉదయం 11.45కు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్నారు. విమానాశ్రయంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటుగా తూర్పు నౌకాదళాధిపతి, కలెక్టర్, సీపీ, ఎస్సీ, తదితర అధికారులతో పాటు మేయరు, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగత కార్యక్రమంలో పాల్గొననున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. 29న ఉదయం 11.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని అధికారిక ప్రకటనలో తెలిపారు.
(జూన్ 25న సాయిచంద్ పుట్టినరోజు) నటుడు సాయిచంద్ ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ లో అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరో కావాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆరంభంలో ‘మాభూమి’ వంటి సంచలనాత్మక చిత్రంలో ప్రధాన భూమిక పోషించి మెప్పించారు. ఆ తరువాత ‘మంచు పల్లకి’లో చిరంజీవి స్నేహితునిగా, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘ఈ దేశంలో ఒక రోజు’ వంటి చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రలూ పోషించారు. బాపు ‘పెళ్ళీడు పిల్లలు’లో ఓ హీరోగా నటించారు. ‘ఈ చదువులు మాకొద్దు’లోనూ కీలక […]
(జూన్ 25న మహానటి శారద పుట్టినరోజు) ఇప్పుడంటే జాతీయ స్థాయిలో నటనలో ఉత్తములుగా నిలిచిన వారిని ‘జాతీయ ఉత్తమనటుడు’, ‘జాతీయ ఉత్తమనటి’ అంటున్నాం. కానీ, ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమనటునికి ‘భరత్’ అని, ఉత్తమనటికి ‘ఊర్వశి’ అని అవార్డులు అందించేవారు. అలా మూడుసార్లు ‘ఊర్వశి’గా నిలిచిన నటీమణి శారద. 1967లో నటీమణులకు కూడా నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం ఆరంభించారు. తొలి అవార్డును ‘రాత్ ఔర్ దిన్’ ద్వారా నర్గీస్ దత్ అందుకున్నారు. మరుసటి సంవత్సరమే అంటే […]