ఈ నెల 4న నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో తొలకరి వర్షాలు కురిశాయి. కాగా ఆ తర్వాతి నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. నిన్న నల్గొండ జిల్లాలో అత్యధికంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో వాన జాడే లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని వాతావరణశాఖ తెలిపారు.