ప్రధాని మోడీ నేడు అయోధ్య రామాలయ అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ సమీక్షించనున్నారు. ఈ మీటింగ్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆలయ పనులు వేగంగా జరుగుతుండగా.. మందిర నిర్మాణానికి కావాల్సిన నిపుణులు పూర్తిగా అందుబాటులోకి వచ్చారు. సాంకేతికంగా చేయాల్సిన పనులన్నీ పూర్తయ్యాయి. అయితే తాజాగా మోడీ రామాలయ పనులు జరుగుతున్న తీరుపై పూర్తిస్థాయి రివ్యూ చేయనున్నారు. కాగా రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే.