మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. మరో ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన టిపీసీసీ చీఫ్‌గా ఎన్నికైన రేవంత్‌రెడ్డి గత రాత్రి పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డిని కలిశారు. అనంతరం శాననమండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ […]
సినీ విశ్లేషకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మొదట స్వల్పగాయాలు అయ్యాయని సమాచారం అందగా.. ఫోటోలు వైరల్ కావడంతో తీవ్రంగానే గాయపడ్డట్లు తెలిసింది. కత్తి మహేశ్ తల, కంటి భాగాలకు తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వెంటిలేటర్‌పై పెట్టామన్నారు. […]
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. అయితే ప్రకటన వచ్చిన కాసేపటికే మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి శనివారం రాత్రి లేఖ పంపారు.ఇక టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి.. పార్టీలో చిన్ని చిన్న విభేదాలు సహజమేనని.. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని […]
టీఎంసీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నమ్మించి దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి మిమి చక్రవర్తిని ఓ టీకా కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే, ప్రజలకు టీకాపై ఉన్న అనుమానాలు తొలగించేందుకు ఆమె కూడా టీకా వేయించుకున్నారు. ఆతర్వాత ఆమె డీహైడ్రేషన్ కు గురైంది.. బీపీ కూడా పడిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆవెంటనే కడుపునొప్పి కూడా రావడంతో ఆమె అనారోగ్యానికి టీకానే […]
గుజరాతీ గ్లామర్ బ్యూటీ మోనాల్ గజ్జర్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా అవకాశాలు, వెబ్ సిరీస్, టీవీ షోలు బాగానే ఉండటంతో హైదరాబాద్ లోనే వుంటుంది. ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోషూట్స్ తోను బిజీగా మారింది. అయితే మోనాల్ హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వాలని వున్నట్లుగా గతంలోనే స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇప్పుడు తన కల నెరవేరిందంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘మొత్తానికి […]
ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఇక డీజిల్ కూడా సెంచరీకి సిద్దమవుతుంది. తాజా పెంపుతో సెంచరీదాటిన పెట్రోల్ రాష్ట్రాల్లో తమిళనాడు కూడా చేరిపోయింది. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్‌కు 36 పైసలు.. డీజిల్ ధర 26 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.32 కాగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.70 కు చేరింది. ఢిల్లీలో […]
(జూన్ 27తో ‘ప్రేమకానుక’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1981లో ‘ప్రేమాభిషేకం’తో జైత్రయాత్ర సాగించారు. అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన ‘ప్రేమాభిషేకం’ దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందింది. అదే పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అదే ఏడాది వచ్చిన చిత్రం ‘ప్రేమకానుక’. ‘ప్రేమ’ అన్న మాట ఏయన్నార్ కు భలేగా అచ్చివచ్చిందనే చెప్పాలి. అదే తీరున ‘ప్రేమకానుక’లోనూ ప్రేమ చోటుచేసుకుంది. అక్కినేని సోలో హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన చిత్రం ఇదొక్కటే అని చెప్పవచ్చు. ఇందులో హీరో […]
ఇస్మార్ట్ బ్యూటీ వరుస ఆఫర్లతో టాలీవుడ్ లోనే కాదు తమిళ సినిమాలతోను బిజీ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా మొదటి సినిమా ‘హీరో’ లో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ కోలీవుడ్ లోను ఓ బడా హీరోతో నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయని త్వరలోనే […]
తన ఒకే ఒక్క చిత్రంలో ప్రపంచంలోని ఏడు వింతలు చూపించి… వెండితెర మీద ఎనిమిదో వింతని ఆవిష్కరించాడు దర్శకుడు శంకర్. ‘జీన్స్’ లాంటి రొమాంటిక్ చిత్రం మొదలు ‘భారతీయుడు’ లాంటి సందేశాత్మక చిత్రం, ‘రోబో’ లాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రం దాకా… ఆయన ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అద్భుతమే! అయితే, గత కొంత కాలంగా శంకర్ టైం బ్యాడ్ మోడ్ లో నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఆయన చిత్రాలు తన స్థాయికి తగ్గట్టుగా సెన్సేషన్ సృష్టించటం లేదు. […]
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తన 36వ జన్మదినం ఘనంగా జరుపుకున్నాడు. ముంబైలోని ఓ స్టార్ హోటల్లో ఆయన బీ-టౌన్స్ స్టార్స్ కి బర్త్ డే పార్టీ ఇచ్చాడు. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, ఆలియా భట్ లాంటి బిగ్ సెలబ్రిటీస్ హాజరయ్యారు. వారితో బాటూ అర్జున్ కపూర్ చెల్లెళ్లు జాన్వీ, ఖుషీ కపూర్ కూడా అన్నయ్య పుట్టిన రోజు వేడుకలో సందడి చేశారు. ఇక ‘లైగర్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మన విజయ్ దేవరకొండ కూడా […]