సినిమాలకు గుడ్ బై.. స్టార్ హీరోయిన్ కూతురు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అలనాటి అందాల హీరోయిన్ రాధ కూతురే ‘కార్తీక నాయర్’.. 17 ఏళ్లకే ‘జోష్’ చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తమిళంలో ‘కో’ ( తెలుగులో రంగం) సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో యూత్‌లో కార్తీకకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆతరువాత మలయాళ, కన్నడ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆతర్వాత కార్తీకకు ఆఫర్లు తగ్గాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘దమ్ము’, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’చిత్రాల్లో కీలకపాత్ర పోషించిన ఆమె.. 2016లో విడుదలైన ‘వా డీల్’ తర్వాత తెరపై కనిపించలేదు. అయితే తాజాగా కార్తీక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. కార్తీక సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో తన వ్యాపార సంస్థను మరింత అభివృద్ధి చేయాలనే భావనలో కార్తీక సినిమాలను చేయకపోవచ్చు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

Also Read
తాజావార్తలు
-
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?