కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గుడ్ లక్ సఖీ’. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో సుధీర్ చంద్ర పాదిరి దీనిని నిర్మించారు. దిల్ రాజు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు. విశేషం ఏమంటే తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను నిర్మించారు. కీర్తి సురేశ్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీని జూన్ 3న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దాంతో కీర్తి సురేశ్ అభిమానులు మూవీ రిలీజ్ ఎప్పుడంటూ నిర్మాతపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Read Also: ‘రాక్షసుడు’ను హిందీలో రీమేక్ రైట్స్ కొనేసిన అక్షయ్ కుమార్!
కీర్తి డైహార్డ్ ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న నిర్మాత, ఎంపిక చేసిన యాభై మంది అభిమానులకు ఈ సినిమాను తన ఎడిట్ రూమ్ లో చూపించాలనే నిర్ణయానికి వచ్చారట. ఓ అభిమానికి సోషల్ మీడియా ద్వారా ఆయన అదే సమాధానం చెప్పారు. దాంతో కీర్తి సురేశ్ ఫ్యాన్స్ సినిమా చూసేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవడం ప్రారంభించారట. వీరికి ఈ సినిమా ఎప్పుడు చూపిస్తారో తెలియదు కానీ… అదే జరిగితే నిర్మాతకు ఓ రకంగా మూవీకి సంబంధించిన గుడ్ ఫీడ్ బ్యాక్ కూడా లభించినట్టు అవుతుంది. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందించిన ‘గుడ్ లక్ సఖీ’కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.