జాతీయ అవార్డు గ్రహీత గుల్జార్, గ్రామీ అండ్ అకాడమీ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ కాంబినేషన్ లో విడుదలైంది యాంథమ్ ఆఫ్ హోప్ ‘మేరీ పుకార్ సునో’. సోనీ మ్యూజిక్ ఇండియా సంస్థ విడుదల చేసిన ఈ సింగిల్ ఆల్బమ్ లోని గీతాన్ని అల్కా యాజ్ఞిక్, శ్రియో ఘోషల్, కె.ఎస్. చిత్ర, సాధన సర్గమ్ తో పాటు అర్మాన్ మల్లిక్, సషా తృప్తి, ఆసీస్ కౌర్ గానం చేశారు. జూన్ 25న ఈ గీతం ఇలా విడుదలైందో […]
టాలీవుడ్ లక్కీ గర్ల్ రష్మిక మందన ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా వుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ లో ‘పుష్ప’ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. అటు బాలీవుడ్ సినిమాలతోను జోరు మీద వుంది. ఇటీవలే బీటౌన్ ఆఫర్లతో ముంబైకి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బాయ్’ సినిమాల్లో నటిస్తోంది. ఇదిలావుంటే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుండే రష్మిక మందన.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ […]
సినిమా అంటే క్రియేటివిటి మాత్రమే కాదు. కోట్లాది రూపాయల వ్యాపారం కూడా. అందుకే, కరోనా ఎఫెక్ట్ తో మీద లాక్ డౌన్స్ కారణంగా సినిమా రంగం అల్లాడిపోతోంది. థియేటర్స్ లో పాప్ కార్న్ అమ్మేవాడు మొదలు వందల కోట్లు ఖర్చు చేసే దమ్మున్న నిర్మాతల దాకా అందరికీ అతి కష్టంగా సమయం గడుస్తోంది. మరి ఈ సమయంలో పరిష్కారం ఏంటి? ఇండియాలో సెకండ్ వేవ్ కూడా కాస్త తెరిపినిచ్చింది కాబట్టి టాప్ స్టార్స్ చకచకా సినిమాలు చేయటమే […]
2013లో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’కు సీక్వెల్ గా ఈ యేడాది ‘దృశ్యం -2’ రూపుదిద్దుకుంది. నిజానికి ఈ సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 19న వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ చేశారు. స్టార్ హీరో మోహన్ లాల్ మూవీ ఇలా స్ట్రయిట్ గా ఓటీటీలో విడుదల కావడం ఇదే మొదటిసారి. తెలుగులో ఇప్పటికే వెంకటేశ్ ‘దృశ్యం’ను రీమేక్ చేశారు, ఇప్పుడు ‘దృశ్యం […]
బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ నెట్ ఫ్లిక్స్ బాట పట్టబోతున్నాడు. స్ట్రీమింగ్ జెయింట్ తలపెట్టిన ఓ నాన్ ఫిక్షన్ షోలో బ్రిటీష్ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్ తో కలసి సాహసాలు చేయనున్నాడు. జూలై, ఆగస్ట్ నెలల్లో రణవీర్ సైబీరియాలో కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ తో కూడిన షూట్ కి సిద్ధం అవుతున్నాడు! Read Also: అవికా గోర్ బర్త్ డే హంగామా మామూలుగా లేదుగా! సూపర్ ఫిట్ నెస్ ఉంటేనే ఎవరైనా గ్రిల్స్ అడ్వెంచర్ […]
సౌత్ సినిమాలపై బాలీవుడ్ బడా స్టార్స్ మోజు రోజురోజుకు పెరుగుతోందేగానీ… తగ్గటం లేదు! అక్షయ్ కుమార్ అయితే మరింత జోరు మీదున్నాడు. ఆయన గత చిత్రం ‘లక్ష్మీ’. ఆ సినిమా లారెన్స్ తీసిన దక్షిణాది బ్లాక్ బస్టర్ ‘కాంచన’ మూవీయే! అయితే, ఇప్పుడు మరో రెండు కోలీవుడ్ సూపర్ హిట్స్ తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు మన రీమేక్స్ ‘ఖిలాడీ’!అక్షయ్ కుమార్ ప్రస్తుతం చేస్తున్న పలు చిత్రాల్లో ‘బచ్చన్ పాండే’ కూడా ఒకటి. కృతీ సనోన్, […]
‘బాలికా వధు’ టీవీ సీరియల్ తెలుగు అనువాదం ‘చిన్నారి పెళ్ళికూతురు’తో మనవాళ్ళకు బాగా చేరువై పోయింది అవికా గోర్. ఆమె హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాల’ చక్కని విజయాన్ని అందుకోవడంతో అవికా వెనుదిగిరి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత ఆమె నటించిన ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాలూ సక్సెస్ సాధించాయి. విశేషం ఏమంటే… ఇప్పుడు అవికా గోర్ చేతిలో దాదాపు ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి. అందులో ఆమె […]
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో రాకేశ్ ఓం ప్రకాశ్ మిహ్రా దర్శకత్వంలో నటించిన చిత్రం ‘తుఫాన్’.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, పరేష్ రావల్, ఇషా తల్వార్ కీలకపాత్రలు పోషించారు. భాగ్ మిల్ఖా భాగ్ తర్వాత ఫర్హాన్ అక్తర్-రాకేష్ ఓం ప్రకాశ్ మిహ్రా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కానుండడంతో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 16 నుంచి ‘తుఫాన్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా […]
(జూన్ 30న అల్లరి నరేశ్ పుట్టినరోజు) మొదట్లో పెన్నూ, పేపర్ పట్టుకొని స్క్రిప్ట్ రాయాలి, డైరెక్షన్ చేయాలి అంటూ ఇ.వి.వి.సత్యనారాయణ చిన్న కొడుకు నరేశ్ ఆరాటపడేవాడు. అయితే అప్పటికే తండ్రి దర్శకత్వం వహించిన ఒకట్రెండు సినిమాల్లో బాలనటునిగా దర్శనమిచ్చాడు. కానీ, ఇ.వి.వి. మాత్రం తన పెద్దకొడుకు రాజేశ్ ను హీరోని చేయాలని ఆశించారు. కానీ, తొలుత తెరపై కనిపించిన నరేశ్ నే నటన ఆవహించింది. నటునిగా సక్సెస్ దరి చేరింది. ఈ తరం హీరోల్లో అతివేగంగా యాభై […]