బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ నెట్ ఫ్లిక్స్ బాట పట్టబోతున్నాడు. స్ట్రీమింగ్ జెయింట్ తలపెట్టిన ఓ నాన్ ఫిక్షన్ షోలో బ్రిటీష్ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్ తో కలసి సాహసాలు చేయనున్నాడు. జూలై, ఆగస్ట్ నెలల్లో రణవీర్ సైబీరియాలో కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ తో కూడిన షూట్ కి సిద్ధం అవుతున్నాడు!
Read Also: అవికా గోర్ బర్త్ డే హంగామా మామూలుగా లేదుగా!
సూపర్ ఫిట్ నెస్ ఉంటేనే ఎవరైనా గ్రిల్స్ అడ్వెంచర్ షోలో కనిపించేది! పర్ఫెక్ట్ గా స్టంట్స్ చేయగలిగే వార్ని మాత్రమే బ్రిటీష్ అడ్వెంచరర్ అప్రోచ్ అవుతుంటాడు. ఈసారి ఆయన నెట్ ఫ్లిక్స్ తో అనేక చర్చల తరువాత రణవీర్ తో షో చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇక నెట్ ఫ్లిక్స్ కి కూడా రణవీర్ సింగ్ పాల్గొనబోయే నాన్ ఫిక్షన్ షో అతి పెద్దది కానుంది. భారీ బడ్జెట్ తో సైబీరియా బయలుదేరనున్నారు. ఇప్పటికే గ్రిల్స్, రణవీర్ సింగ్, నెట్ ఫ్లిక్స్ కు సంబంధించిన టీమ్ సభ్యులు పూర్తి ప్లానింగ్, డిస్కషన్స్ పూర్తి చేశారు. షో కోసం ప్రిపరేషన్స్ మొదలైపోయాయి…
సినిమాల విషయానికి వస్తే, కరణ్ జోహర్ దర్శకత్వంలో ఆలియాతో కలసి రణవీర్ సింగ్ ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేయనున్నాడు. మరో వైపు, ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ లో డైరెక్టర్ శంకర్ సారథ్యంలో రణవీర్ పని చేయనున్నాడు. ఇప్పటికే ఈ ఎనర్జిటిక్ స్టార్ ’83, జయేశ్ భాయ్ జోర్ధార్, సర్కస్’ సినిమాలు పూర్తి చేసేశాడు. అవన్నీ విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.