టాలీవుడ్ లక్కీ గర్ల్ రష్మిక మందన ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా వుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ లో ‘పుష్ప’ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. అటు బాలీవుడ్ సినిమాలతోను జోరు మీద వుంది. ఇటీవలే బీటౌన్ ఆఫర్లతో ముంబైకి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బాయ్’ సినిమాల్లో నటిస్తోంది. ఇదిలావుంటే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుండే రష్మిక మందన.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. మీకు ఎలాంటి లక్షణాలు వున్న హస్బెండ్ రావాలని అని ఓ అభిమాని ప్రశ్నించగా.. రష్మిక సమాధామిచ్చింది. హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సాధారణ వ్యక్తి అయి ఉండాలని తెలిపింది. మంచి వ్యక్తిత్వం ఉండాలని.. స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నవారు అస్సలు నచ్చారంటూ చెప్పుకొచ్చింది. ఇక విజయ్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని.. దయచేసి వేరే రిలేషన్షిప్ పేర్లు పెట్టదంటూ రిక్వెస్ట్ చేసింది.