హాలీవుడ్ ను కాపీ కొట్టడంలో బాలీవుడ్ కు ఎన్ని రోజులైనా తనవి తీరదు. సినిమాల విషయంలోనే కాదు స్టైల్స్ సంగతి కూడా అంతే! రణవీర్ తాజా ఇన్ స్టాగ్రామ్ పిక్స్ అదే విషయాన్ని ఋజువు చేస్తాయి. అసలు మామూలుగా ఇండియన్ హీరోలు ఎవరూ ఊహించను కూడా ఊహించని వెరైటీ డ్రస్ వేశాడు బీ-టౌన్ సూపర్ స్టార్!కిందా, మీదా మొత్తం బ్లూ కలర్ సాటిన్ ట్రాక్స్ ధరించిన రణవీర్ పెద్ద జుట్టుతో ఫోజులిచ్చాడు. అది చాలదన్నట్టు నెత్తిన ఓ […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హనుమంతరావు ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈమేరకు సోనియా గాంధీ ఆయనకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. వీహెచ్ త్వరగా కోలుకోవాలని, మీ రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీకి అవసరమని సోనియా పలకరించినట్లు తెలుస్తోంది. తనకు ఫోన్ చేసిన సోనియాకు వీహెచ్ ధన్యవాదాలు తెలిపినట్లు […]
‘ఉప్పెన’ లాంటి ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. ఈ సినిమా సక్సెస్ తో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. కాగా, కరోనా లాక్ డౌన్ తరువాత కృతి పాప షూటింగ్ కి జాయిన్ అవుతోంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ ‘అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. కాగా నేడు కృతిశెట్టి ఈ […]
బాలీవుడ్ లో ఎప్పుడూ భగ్గుమనే క్రేజీ ఫైట్… తాప్సీ, కంగనాదే! కొన్నాళ్లుగా సాగుతోన్న వీరిద్దరి మాటల యుద్ధం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాప్సీ కంగనా గురించి మాట్లాడటంతో ఈసారి రచ్చ మొదలైంది. కానీ, తాప్సీ పెద్దగా తప్పుగా ఏం మాట్లాడలేదు ఫైర్ బ్రాండ్ కంగనా గురించి. అయినా, బీ-టౌన్ ‘తలైవి’ తాప్సీకి మరోసారి గట్టిగా తలంటేసింది!ఓ ఇంటర్వ్యూలో… ‘కంగనా మంచి నటి. గతంలోనూ, ఇప్పుడు కూడా, ఇక మీదట కూడా’ అంది తాప్సీ. అంతే కాదు, ఆమెను […]
(జూలై 1న కేవీ రెడ్డి జయంతి) చారిత్రకంతోనే తొలి ఢీజానపదాలలో గారడిపురాణాలతో భలే సందడిసాంఘికాలలోనూ సవ్వడిఇలా చేసిన ఘనుడు కేవీ రెడ్డి! తొలి చిత్రం ‘భక్త పోతన’లోనే తెలుగు సినిమాకు కావలసిన కొత్త గ్రామర్ ను తీసుకు వచ్చారు కేవీ. ‘గుణసుందరి’లో తెలుగు షేక్సిపియర్ గా మారిన కేవీ, ‘పాతాళభైరవి’తో చూపించారు మరింత ఠీవి. ఇక ‘మాయాబజార్’తో చేసిన సందడిని ఎవరు మాత్రం మరువగలరు? ‘చిగురాకులలో చిలకమ్మలకు చిన్నమాటలు వినిపించిందీ’ కేవీగారి ‘దొంగరాముడే’. సమాజంలోని ‘పెద్దమనుషుల’ బాగోతాలు […]
వనపర్తి జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీరావు లంచం తీసుకుంటూ అనినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏపీలోని అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన నాగరాజు.. పీఎన్ఆర్ సీడ్స్ పేరిట మొక్కల వ్యాపారం చేస్తున్నారు. వనపర్తి జిల్లాలోని నర్సరీలకు మొక్కలు సరఫరా చేశారు. ఇందుకు బిల్లులు మంజురు చేయాల్సి ఉండగా.. డీఎఫ్‌వో బాబ్జీరావు లంచం డిమాండ్ చేశారు. దీంతో మొక్కల వ్యాపారి నాగరాజు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. నేడు రూ.3 లక్షల లంచం తీసుకొంటుండగా.. అధికారులు […]
కృష్ణానదీ జలాల వినియోగంపై క్రమక్రమంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదం పెరుగుతున్నది. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పేరిట రిజర్వాయరు సామర్థ్యం పెంచడం వల్ల శ్రీశైలం నీటిని తరలించుకుపోతారని తెలంగాణ ఆరోపణ. రాజోలిబండ డైవర్షన్ దగ్గర పనులకూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది.అయితే ఈ క్రమంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని దొంగ అని జగన్ గజదొంగ అని వ్యాఖ్యానించడం. తర్వాత ఏకంగా రాక్షసుడని తిట్టిపోయడం వేడిపెంచింది. ఇలా మాట్లాడటం సమంజసం […]
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రముఖులు కూడా కరోనా టీకా వేసుకొని అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ మెహరీన్ తన స్టాప్ తో కలిసి వ్యాక్సిన్ తీసుకుంది. టీకా ఇంజక్షన్ తీసుకునే సమయంలో తెగ వణికిపోతూ కంగారు పడింది. మెహరీన్ ఫోటోని సైతం షేర్ చేసి టీకా అనుభవాన్ని పంచుకొంది. టీకా అందరూ విధిగా వేసుకోవాలని.. దీన్ని నేషనల్ డ్యూటీగా భావించి చేయాలని మెహరీన్ పేర్కొంది. కాగా, కరోనా […]
తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్‌గా ఎంపీ రేవంత్ రెడ్డికి పగ్గాలు రావడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహాం కనిపిస్తోంది. ఈ జోష్ ను ఇలానే కంటిన్యూ చేయడానికి పక్క ప్రణాళికతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని 33 జిల్లాలను మొత్తం చుట్టేలా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంతోపాటు తన సొంత ఇమేజ్‌ను పెంచుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడం ఒక్కటే మార్గమని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని […]