బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో రాకేశ్ ఓం ప్రకాశ్ మిహ్రా దర్శకత్వంలో నటించిన చిత్రం ‘తుఫాన్’.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, పరేష్ రావల్, ఇషా తల్వార్ కీలకపాత్రలు పోషించారు. భాగ్ మిల్ఖా భాగ్ తర్వాత ఫర్హాన్ అక్తర్-రాకేష్ ఓం ప్రకాశ్ మిహ్రా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కానుండడంతో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 16 నుంచి ‘తుఫాన్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్ దూకుడు పెంచారు. ఈ క్రమంలో తాజాగా తుఫాన్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. ఓ వీధి ఫైటర్.. జాతీయ స్థాయి బాక్సర్ గా ఎలా మారాడు అనే కథాంశంతో ‘తుఫాన్’ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఆయన ప్రేయసి మృణాల్ ఠాకూర్ ప్రోత్సాహంతో ఫర్హాన్ బాక్సింగ్ లో ఎలా రాణించాడనేది ప్రధాన అంశంగా తెలుస్తోంది. ట్రైలర్ లో ఎక్కువ భాగం పంచ్ లు, ప్రేయసి అతన్ని ప్రొఫెషనల్ బాక్సర్ గా మార్చిన తీరు కనిపించింది. కాగా ఫర్హాన్ పంచ్ ఓటీటీలో ఏమేర మెప్పిస్తుందో తెలియాలంటే జూలై 16 వరకు ఆగాల్సిందే.