HYDRA: హైడ్రాకు అండగా న్యాయ నిపుణులు.. న్యాయ సలహాలు అందిస్తామని వెల్లడి
- న్యాయ నిపుణులతో హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం
- చెరువుల పరిరక్షణ, పునరుజ్జీవానికి కృషి చేస్తున్న హైడ్రాకు న్యాయ సలహాలు అందించడానికి..,
- ఎప్పుడూ అందుబాటులో ఉంటాం- న్యాయ నిపుణులు
- ప్రభుత్వ స్థలాలతో పాటు రహదారులు, పార్కులు కబ్జా కాకుండా..,
- కాపాడుతున్న హైడ్రాకు అభినందనలు తెలిపిన న్యాయ నిపుణుల బృందం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూములను కాపాడడంలో తలెత్తుతున్న ఇబ్బందులు, న్యాయపరమైన అంశాలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై న్యాయ నిపుణులతో హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చెరువుల పరిరక్షణ, పునరుజ్జీవానికి కృషి చేస్తున్న హైడ్రాకు న్యాయ సలహాలు అందించడానికి ఎళ్లప్పుడూ అందుబాటులో ఉంటామని న్యాయ నిపుణులు తెలిపారు. మరోవైపు.. ప్రభుత్వ స్థలాలతో పాటు రహదారులు, పార్కులు కబ్జా కాకుండా కాపాడుతున్న హైడ్రాను న్యాయ నిపుణులు అభినందించారు. చెరువులను పునరుద్ధరించడం, వరద కాలువలను సజీవంగా ఉంచడంతోనే నగరానికి వరద ముప్పు తప్పుతుందని నిపుణులు సూచనలు ఇచ్చారు. గొలుసుకట్టు చెరువులు లింకు తెగిపోవడంతో 2 సెంటీ మీటర్లు దాటి వర్షం పడితే నగర రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Allu Arjun: ఇదేమీ పర్సనల్ ఎటాక్ కాదు.. అందరినీ గౌరవిస్తా!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణకు సంబంధించి చట్టాలున్నప్పటికీ వాటిని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందని సభ్యులు తెలిపారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని హైడ్రా తీసుకువచ్చి.. భవిష్యత్ తరాలకు పర్యావరణంతో కూడిన మెరుగైన జీవనాన్ని అందిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువు శిఖం భూముల విషయంలో ప్రైవేటు పట్టాలున్న వారు వ్యవసాయం మాత్రమే చేసుకోవాల్సి ఉంది.. మరే ఇతర హక్కులు ఉండవని స్పష్టం చేశారు. చెరువుల మధ్య నుంచి పలు చోట్ల రహదారులు నిర్మించారని.. అయితే ఇరువైపులా నీటికి అడ్డు లేకుండా పై వంతెనలు కడితే బాగుంటుందని సభ్యులు సూచించారు.
Alcohol: మందు తాగేటప్పుడు వీటిని అస్సలు తినొద్దు..
చెరువుల బఫర్ జోన్లలో మట్టితో నింపేసి.. వారి స్థలం ముంపు ప్రాతంలో లేదని చూపించే ప్రయత్నాలను ఎన్ఆర్ఎస్ఏ, సర్వే ఆఫ్ ఇండియా, గ్రామీణ మ్యాప్‌ల ద్వారా నివారించవచ్చు అని తెలిపారు. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అనుమతి లేని లే ఔట్లలోని ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేని వ్యవస్థ రావాలని సూచించారు. అలాగే మాస్టర్ ప్లాన్‌లో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు దుర్వినియోగం అయితే నేరుగా చర్యలు తీసుకోవచ్చునన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోకి గ్రామాలు చేరినప్పుడు గ్రామపంచాయతీ లే ఔట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవని స్పష్టం చేశారు. లే ఔట్లలో 30 శాతం భూమిని ప్రజావసరాల కోసం కేటాయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భూ వినియోగానికి సంబంధించిన సవరణలు ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయన్నారు. అనుమతి పొందిన లే ఔట్‌ను అతిక్రమించి నిర్మాణాలు చేపడితే చట్టం ప్రకారం కూల్చివేయవచ్చని వర్క్‌షాప్ నొక్కి చెప్పింది. ఈ సదస్సులో హైకోర్టు సీనియర్ న్యాయవాది రేసు మహేందర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు, వివిధ శాఖలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!